విజయవాడ : జగన్ సర్కార్ పై మరోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగను కు అధికార పిచ్చి పట్టుకుందని.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని జగన్ కాల రాస్తున్నారని మండిపడ్డారు రామకృష్ణ. ఎన్నికల కమిషనుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని.. స్థానిక ఎన్నికల అక్రమాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేస్తే గంట లో స్పందిస్తామన్న ఎన్నికల కమీషన్ ఎక్కడుంది.. ? అని నిలదీశారు రామకృష్ణ.
ప్రతిపక్షాలకు పోటీ చేసే హక్కు లేదా .. ? బలవంతపు , బెదిరింపులు ఏకగ్రీవాలు చేసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు.. ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ. అమరావతి రైతుల పాదయాత్ర కు అడ్డంకు లెందుకు.. ? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
హై కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం లో చలనం రాదా..? అని నిప్పులు చెరిగారు రామకృష్ణ. అమరావతి రాజధాని విషయం లో రెఫరెండం పెట్టండి అంటూ ఫైర్ అయ్యారు రామకృష్ణ. ఒక్క ఓటు ప్రభుత్వాని కి ఎక్కువ వచ్చినా మేము అమరావతి పై మాట్లాడమనీ పేర్కొన్నారు రామకృష్ణ. పోలీ సులు అమరావతి రైతుల పాదయాత్ర కు అడుగడుగునా ఆటంకం సృష్టించడం మంచి పద్ధతి కాదని అగ్రహించారు రామకృష్ణ. రైతులు కరోనా నిబంధనలు పాటిస్తూ శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్నారని.. తెలిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసిపి పార్టీ నేతలకు లేని కరోనా నిబంధనలు అమరావతి రైతులకే వర్తిస్తాయా ? అని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ. మహిళ మనులు రైతుల పాదయాత్ర కోసం అడ్డంకులు సృష్టించడం సబబా అని.. కడుపు మండి ధర్నా చేసే మహిళా మనుల రైతులను వక్రీకరించేలా మాట్లాడటమేంటన్నారు రామ కృష్ణ