కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్..!
కుప్పం 14వ వార్డులో టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్‌ను మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ లు కిడ్నాప్ చేశారని పోలీసులకు బంధువుల ఫిర్యాదు చేశారు. అదేవిధంగా టీడీపీ నుండి 14వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన మాజీ సర్పంచ్, ఎంపీపీ వెంకటేష్‌ను అడ్డుకుని నామినేషన్ పత్రాలను వైసీపీ శ్రేణులు చించేశారని మరోసారి వెంకటేష్ నామినేషన్ దాఖలు చేసారు.
అయితే హై డ్రామా మధ్య ఎన్నికల అధికారులు స్క్రూట్నిలో తొలుత వెంకటేష్ నామినేషన్ ను ఒకే చేసిన తరువాత రాత్రికి రాత్రి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రెండో నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థిగా ప్రకాశ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌ను అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు పీఏ మనోహర్, కుప్పం నియోజకవర్గం ఇన్చార్జీ పీఎస్ మునిరత్నం, నామినేషన్ తిరష్కరణకు గురైన అభ్యర్థి వెంకటేష్‌లు కిడ్నాప్ చేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ చర్చనీయాంశముగా మారినది.
కిడ్నాప్ కు గురైన ప్రకాశ్ అన్న గోవిందరాజులు మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు పీఏ మనోహర్, టీడీపీ నేతలు పీఎస్ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్‌లు కలిసి నా తమ్ముడు ప్రకాశ్, అతని భార్య, ఇద్దరు పిల్లలను బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా సొంత పార్టీకి చెందిన అభ్యర్థినే కిడ్నాప్ చేయడం దారుణం అని గోవిందరాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ కిడ్నాప్ కాకుండానే భయబ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించింది.