నో డౌట్: నెల్లూరులో నో ఛేంజ్?

M N Amaleswara rao
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి....ఓ వైపు అధికార వైసీపీ ఇంకా బలపడాలని పావులు కదుపుతుంది....అసలు ప్రతిపక్షాలకు ఏ మాత్రం ప్లేస్ లేకుండా చేయాలని చూస్తోంది. అటు ప్రతిపక్ష టీడీపీ ఏమో...వైసీపీకి చెక్ పెట్టేసి సత్తా చాటాలని ఎక్కడకక్కడే ప్రయత్నిస్తుంది. ఇటు జనసేన సైతం తమ సత్తా ఏంటో చూపించాలని అనుకుంటుంది. ఇలా మూడు పార్టీల రాజకీయాలతో రాష్ట్రంలో పరిస్తితులు ఒక్కసారిగా మారిపోయాయి...పైగా టీడీపీ-జనసేనలు ఏకమై వైసీపీకి చెక్ పెట్టనున్నాయనే ప్రచారం కూడా రాష్ట్ర రాజకీయాన్ని మారుస్తుంది.

ఈ రెండు పార్టీలు కలిస్తే కొన్ని చోట్ల వైసీపీకి చెక్ పడొచ్చని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. కానీ రెండు పార్టీలు కలిసినా...కలవకపోయినా సరే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట...రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఉన్నా సరే ఇక్కడ మాత్రం వైసీపీకి అనుకూలంగానే రాజకీయం నడుస్తుందని చెబుతున్నారు.

ఎందుకంటే గత రెండు ఎన్నికలని చూస్తే అదే సీన్ కనిపించింది. అసలు 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి బరిలో దిగాయి...అయినా సరే నెల్లూరులో వైసీపీకి చెక్ పెట్టలేకపోయాయి. జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది...టీడీపీకి గుండు సున్నా మిగిలింది.

అంటే నెల్లూరు జిల్లాలో రాజకీయం ఎలా ఉందో అర్ధం అవుతుంది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా నెల్లూరులో వైసీపీదే హవా..ఇక త్వరలో జరగనున్న నెల్లూరు కార్పొరేషన్‌లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం ఉంటుందని అర్ధమవుతుంది. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ లీడింగ్‌ని తగ్గించడం కష్టమే అని చెప్పాలి. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి వచ్చినా సరే...నెల్లూరులో రెండు, మూడు సీట్లలో తేడా వస్తుందేమో గానీ, మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ హవానే కొనసాగుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: