కోడలు అని షర్మిల వచ్చింది... టీడీపీ నుంచి కొడుకు రావొచ్చు !

Veldandi Saikiran
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ లో రకరకాల చర్చలు నడుస్తున్నాయని... ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య విచిత్రమైన చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.  రాష్ట్రం విడిపోక ముందు ఒకలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరోలా చర్చ జరుగుతోందని... అనేక అంశాలతో తెలంగాణ ఉద్యమం జరిగిందని ఫైర్‌ అయ్యారు.  ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ఉండేవని.. రాష్ట్ర విభజనకు సంబంధించి మేధావులు, కవులు, కళాకారుల డిమాండ్లు వినిపించారు.


 కేసీఆర్ కూడా ఉద్యమానికి కలిసి వచ్చారని గుర్తు చేశారు.  ఈమధ్య లో కొత్త చర్చ జరుగుతోంది. సమైక్యంగా ఉంటే బాగుండు అనే కోణంలో మాట్లాడుటున్నారని... ఇప్పుడు ఎవరు సంతృప్తిలో లేరు. ఉద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాలకే రాష్ట్రం కలిసి ఉండాలని చర్చ వచ్చిందని... షర్మిల తెలంగాణ కోడలు అనే పేరుతో స్పెస్ తీసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.  టీడీపీ నుంచి కూడా తెలంగాణ కొడుకును అని ఎవరైనా రావొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ పిల్లలు కూడా తెలంగాణనే అని చెప్పొచ్చని...  కొంత గందరగోళం ఏర్పడింది.


లోకేష్ కూడా తెలంగా ణ లో పుట్ట ణాని చె బుతు న్నారని మం డిపడ్డారు. రాయచూరు, మహారాష్ట్ర, ఏపి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తమను కలపండి అనే డిమాం డ్లు చూస్తున్నామన్నారు.  బీజేపీ గోడ మీద కూర్చుం టారు. కలవమంటే కలుపుతారు. విడగొట్టమంటే విడగడతారు.కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోదని మండిపడ్డారు.  నేను మూడు ప్రాం తాలు కలిసి ఉం డాలని చె ప్పిన. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా నా వాయిస్ వినిపించారన్నారు.  గతంలో నేను చెప్పిన విషయాన్నే ఇప్పుడు అందరు అంటున్నా రని తె లిపారు. రే వంత్ రెడ్డి వ్యాఖ్యలు పీసీసీ హోదాలో అన్నారన్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: