కేసీఆర్ Vs ఈటెల ఆఖరు పోరాటంలో వెనకపడిపోయిన ఈటల..!
ఇక్కడ టీఆర్ ఎస్ ఓటుకు రు. 6 వేలు పంచింది. అయితే బీజేపీ మాత్రం డబ్బు పంపిణీలో వెనక పడిందనే అంటున్నారు. ఆ పార్టీ రు. 1500 మాత్రమే ఓటుకు పంపిణీ చేసింది. అది కూడా నియోజకవర్గం అంతా కాకుండా కేవలం లక్ష ఓటర్లకే పంపిణీ చేసినట్టు చెపుతున్నారు. అయితే చివర్లో ఓటుకు రు. 1500 కాకుండా.. కేవలం రు. 500 మాత్రమే పంచుతుండడంతో ఓటర్లు గగ్గోలు పెట్టిన పరిస్థితి.
బీజేపీ వాళ్లు రూ.1500 లకు 500 మాత్రమే ఇస్తున్నారని స్థానికులు ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. మనీ మేనేజ్ మెంట్‌లో ఈటల వెనక పడినంత మాత్రాన ఆయన గెలవరని అనుకోలేని పరిస్థితి. ఇక నియోజ క వర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 2,37,036 ఉన్నారు.
వీరిలో పురుషులు 1,17,933, స్త్రీలు 1,19,102 ఉండగా.. 14 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా ఉన్నారు. ఇక మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో...306 కంట్రోల్ యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక ఇక్కడ కౌంటింగ్ వచ్చే నెల 2వ తేదీన జరగ నుంది.