పీకే వ్యూహం..లోకేష్ సీఎం..జగన్ రెండోసారి..!
ఇదే క్రమంలో ఓ వైపు జగన్‌కు ఎలాగైనా చెక్ పెట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు...అటు జగన్ సైతం...తన వ్యూహకర్త పీకేని నమ్ముకుని ముందుకెళుతున్నారు...ఆయన వ్యూహాలతో చంద్రబాబుకు చెక్ పెట్టి రెండోసారి సీఎం కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పీకే టీం ఆల్రెడీ ఏపీలో దిగేసి, వ్యూహాలు రచిస్తూ టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని...టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు సైతం వచ్చేస్తున్నాయి.
పీకే వ్యూహంలో భాగంగా పీకే టీం సభ్యులు...జనాల్లోకి వెళ్ళిపోయి...టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అని ప్రచారం చేయనున్నారని చెబుతుంది. అంటే బాబుకు వయసైపోయింది..కాబట్టి లోకేష్ సీఎంని చెప్పనున్నారని టీడీపీ అనుకూల మీడియా అంటుంది. అంటే ఎలాగో లోకేష్‌కు సమర్ధుడు కాదు కాబట్టి...మళ్ళీ జనం జగన్ వైపే చూసి రెండోసారి సీఎంని చేస్తారనేది పీకే వ్యూహామని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల ముందు పీకే వ్యూహాలని టీడీపీ సరిగ్గా తిప్పకొట్టలేకపోయింది. సోషల్ మీడియాలో వైసీపీ, పీకే టీంల వ్యూహాల ముందు టీడీపీ చిత్తు అయిందని, కానీ ఈ సారి అవ్వకూడదని టీడీపీ బాగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయి ఉందని, పీకే వ్యూహాలని ముందే పసిగడుతున్నారని చెబుతున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు పీకే టీం పన్నాగంలో...మొదట లోకేష్ సీఎం అభ్యర్ధి అని ప్రచారం చేయనున్నారని, ఆ ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారని, ఇప్పటికే చంద్రబాబే మళ్ళీ సీఎం అవుతారని అందులో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు. టీడీపీ నేతలు కూడా...తమ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం కానున్నారని ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.