దారికొస్తున్న మహారాష్ట్ర, కేరళ.. ఇక అంతా హ్యాపీ?

praveen
మొన్నటి వరకు దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి దశ కరోనా వైరస్ ను అన్ని రాష్ట్రాలు కాస్త సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ రెండవ దశ కరోనా వైరస్ వేగాన్ని మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క రోజులోనే నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో రెండవ దశ కరోనా వైరస్ బారిన పడిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలు తలెత్తడం.. ఇక అదే సమయంలో దేశంలో అక్సిజన్ కొరత ఏర్పడటంతో మరింత దారుణ పరిస్థితులకు వచ్చాయి అని చెప్పాలి.



 అయితే దేశ వ్యాప్తంగా మొదటి దశ నుంచి రెండవ దశ వరకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయ్. కానీ అటు మహారాష్ట్ర మాత్రం మొదటి నుంచి వైరస్ వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి దశలో ఏ రాష్ట్రంలో లేనంతగా కేవలం మహారాష్ట్రలోనే భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో దేశంలో వెలుగులోకి వచ్చిన కేసులలో సగంపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొదటి దశలో కరోనా వైరస్ ను ఎంతో అద్భుతంగా కట్టడి చేసిన  కేరళ రెండవ దశలో మాత్రం కంట్రోల్ చేయ లేక పోయింది. దీంతో కేరళలో కూడా ఒక రేంజ్ లో కరోనా వైరస్ కేసులు పెరిగి పోయాయి అని చెప్పాలి.


 అయితే సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా విధించాయ్. దీంతో అన్ని రాష్ట్రాల్లో  వైరస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ అటు కేరళ మహారాష్ట్ర లో మాత్రం విపరీతమైన కేసులు వెలుగులోకి రావడం సంచలనం గా మారిపోయింది. దేశం లో వచ్చిన దాదాపు 70 శాతానికి పైగా కేసులు కేవలం ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చాయి. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో పూర్తిగా వైరస్ ప్రభావం తగ్గుతు వస్తుంది  అయితే ఈ కరోనా వైరస్ సమయంలో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మార్చ్ 2020 తర్వాత మొదటిసారిగా అతి తక్కువగా 889 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేరళ కూడా ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి కోలుకుంటుందది. ఇటీవలే కేరళలో 6 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: