గబ్బిలాలు అంటే ప్రాణం.. ప్రతిరోజు?

praveen
మన దేశంలో ప్రతి ఒక్కరూ దేవుళ్ళను ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు అనే విషయం తెలిసిందే. అయితే  ఏ కష్టం వచ్చినా దేవుళ్లను పూజించడం లాంటివి చూస్తూ ఉంటారు. కొంత మంది అయితే కేవలం దేవాలయంలో ఉన్న దేవుళ్లను మాత్రమే కాకుండా చెట్టు పుట్టలను కూడా దేవుడు గా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. అంతేకాదు ఏకంగా దేవుడికి పూజ చేసే పువ్వులను కూడా దేవతగా భావించి తెలంగాణలో ఏకంగా బతుకమ్మ అనే పండుగ చేసుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుడిని పూజించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 సాధారణంగా గబ్బిలాలను చూస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ముందుగా కాస్త భయపడిపోతారు. ఇక ఆ తర్వాత ఆ గబ్బిలాల దగ్గర నుంచి కాస్త దూరంగావెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు  కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం అలా చేయడం లేదు. తరచూ గబ్బిలాలు ఉండే చెట్ల దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడపండగలు సైతం చేసుకుంటున్నారు. కేవలం ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు అక్కడ గబ్బిలాలు ఉన్న చెట్ల  దగ్గరికి వస్తున్నారు. మరి ఇంత విపరీతంగా జనం అక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఆ గబ్బిలాలనే దైవంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండటం. అయితే ఇలా గబ్బిలాలకు పూజలు చేస్తూ ఉండడం ఎక్కడో జరిగింది కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగింది.


 చిత్తూరు జిల్లా నడవలూరు గ్రామస్తులు వింతైన ఆచారాన్ని పాటిస్తూ ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గ్రామానికి వెళ్తుండగా మొదట్లోనే 11 చింత చెట్లు ఉన్నాయి  ఆ చింత చెట్ల పై గుంపులుగా గబ్బిలాలు ఉంటాయి. ఇక ఆ గబ్బిలాలనే దైవంగా భావిస్తున్నారు స్థానికులు. ఆ చెట్ల వద్ద పెద్ద పెద్ద శుభకార్యాలు సైతం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక వారాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ భక్తిశ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహించారు ఎంతోమంది భక్తులు. ఇక అందరూ కోడి కూతతో నిద్రలేస్తే అక్కడ గ్రామస్తులు మాత్రం గబ్బిలాలు చేసే శబ్దం తో నే  ప్రతి రోజు ఉదయం నిద్ర లేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: