ఆఫ్ఘన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం.. అసలేం జరుగుతుంది?
దీంతో ఆఫ్ఘనిస్తాన్ నడిబొడ్డులో కూడా వాతావరణం ఎంతో హాట్ హాట్ గానే ఉంది. అటు తాలిబన్లు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో అటు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది అన్నది తెలుస్తుంది. ఎన్నో రోజులనుంచి తజకిస్థాన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తూ ఉంది రష్య. ఈ క్రమంలోనే ఇటీవల రానున్న రోజుల్లో భద్రతాపరమైన సమస్యల దృష్ట్యా అటు రష్యన్ సైనికులు అందరూ కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో మోహరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తాలిబన్లకు వ్యతిరేకంగా ఉన్నా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సరిహద్దుల్లోనే ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ తో పాటు పక్కనే ఉన్న తజకిస్తాన్ పై కూడా ఆధిపత్యం సాధించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే అటు రష్యా తజకిస్తాన్ కు అండగా నిలబడింది. ఏకంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ యుద్ధ విన్యాసాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ మొత్తంలో సైన్యం మోహరించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్త బోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే అటు ఎస్ ఐ ఐఎస్ కె తీవ్రవాదులు తాలిబన్లకు వరుసగా సవాళ్ళు విసురుతూ ఉండటం గమనార్హం.