ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

Veldandi Saikiran
కరీంనగర్ :  రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలని.. ఇద్దరూ మొన్నటి దాకా ఒకే కంచంలో తిన్నారన్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.  ఈటెల రాజేందర్ పేదలు భూములు అక్రమించాడని.. దేవుని భూములు అక్రమించాడని నిప్పులు చెరిగారు.  కేసీఆర్ కు ఈటెలకు భూముల పంపకాల దగ్గర పంచాయతీ అని.. ఇద్దరి పంపకాల పంచాయితీ నే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. ఈటెల ఎందుకు రాజీనామా చేశారని.. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలు అన్నారు.  

 ఈటల  రాజేందర్ ను బహిరంగంగా కలిషినమని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.    నీ లెక్క చీకట్ల కలుసుకోలేదని.. చీకట్ల కలుసుకునే అలవాటు నీదని మంత్రి కేటీఆర్ కు చురకలు అంటించారు  రేవంత్ రెడ్డి.  మాజీ మంత్రి  ఈటెల రాజేందర్  నీ బీజేపీ లో చేర్చుకోవడానికి...వచ్చిన కిషన్ రెడ్డీ వచ్చిన విమానం ఎవరిదని నిలదీశారు  రేవంత్ రెడ్డి.  విమాన వివరాలు నువ్వు చెప్తావా. . నేను  బయట పెట్టనా.. ? అని ఫైర్ అయ్యారు   రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మీద చర్చకు సిద్ధమా హరీష్ రావు.. హుజురాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ళు లేని ఊర్లలో ఓట్లు అడగమన్నారు రేవంత్ రెడ్డి.  గెళ్లు... చెల్లని రూపాయని.. నిప్పులు చెరిగారు.  18 మంది మంత్రుల్లో ఒక్కరైనా మాదిగ ఉన్నాడా ? అని ప్రశ్నించారు  రేవంత్ రెడ్డి.  

మాదిగలు మంత్రులు గా పనికి రారా.. ? అని నిలదీశారు రేవంత్ రెడ్డి.   గోర్లు మనం పెంచుకోవాలి... కెసిఆర్ పిల్లలు రాజ్యం ఏలాలా..? అని ఫైర్ అయ్యారు  రేవంత్.  గాడ్సే నేను కాదు రా..సన్నాసి..  ఢిల్లీలో ఉన్న అమిత్ శా గాడ్సే అంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. మీ అయ్య కు గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఉన్న గాడ్సే అని అగ్రహించారు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలమురి వెంకట్ ను గెలిపించందని కోరారు రేవంత్ రెడ్డి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: