కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి !

Veldandi Saikiran
అమరావతి :  ఎందరో స్వాతంత్ర్య సమెయోధులు మాకు స్పూర్తి ప్రదాతలు అని..  బూరుగుల రామకృష్ణ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్నారని గుర్తు చేశారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్.  పివి నరసింహారావు ప్రధాని  అయ్యాక ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తెచ్చారని.. దామోదరం సంజీవయ్య  రెండేళ్లే పదవిలో ఉన్నా... ఎంతో సేవ చేశారన్నారు పవన్ కళ్యాణ్.  వరదరాజుల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు లను ముందుకు తీసుకెళ్లారని.. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం అనేక విధానాలు అమలు చేశారన్నారు. 

తెలుగు భాషలోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు నడపాలని ఆదేశించారని.. వెనుకబడిన తరగతుల‌వారికి రిజర్వేషన్ ల కోసం సంజీవయ్య  కృషి చేశారని కొనియాడారు పవన్ కళ్యాణ్.  చాలా వృద్దాప్య, దివ్యాంగుల  పెన్షన్ పధకాలకు ఆద్యుడు అని.. ఇటువంటి మహనీయుడు పేరు నేటి తరాలకు తెలియకుండా చేశారన్నారు పవన్ కళ్యాణ్.  పాలకులు అటువంటి మహనీయుల త్యాగాలను కనీసం  గుర్తు చేసుకోవడం లేదని.. కోటి రూపాయల నిధులు సేకకరించి... దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.  

కర్నూలు జిల్లాలోని పెదపాడులో ఉన్న ఆయన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని.. ఆయన చనిపోయే నాటికి బ్యాంకులో 17వేలు, ఒక ఫియేట్ కారు మాత్రమే ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్.  మన పాలకులు ఇటువంటి మహానుభావుల త్యాగాలను నేటి తరానికి తెలియ చెప్పానని.. అందుకే మా బాధ్యత గా కోటి రూపాయల నిధులు‌ సేకరించి అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్.  కడప జిల్లాకి వైయస్సార్ అని పేరు పెట్టినప్పుడు.. కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యా ణ్.  వై సి పి ప్రభు త్వం ముందు కు తీసుకె ళ్లకపోతే... అధి కార మార్పి డి జరిగి న అనం తరం మే మే పేరు మారుస్తా మని హెచ్చరించారు పవన్ కళ్యా ణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: