క‌డ‌ప రాజకీయం మారుతోంది... జ‌గ‌న్‌కు మంట మొద‌లైంది..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప లో రాజ‌కీయం ఒక్క సారిగా మారుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ అధికార వైసీపీకి తిరుగు లేకుండా ఉంది. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ 2010 లో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ స్తాపించి న‌ప్ప‌టి నుంచి కూడా క‌డ‌ప లో వైసీపీకి తిరుగులే దు. 2012 ఉప ఎన్నిక‌ల్లో , అంత‌కు ముందు క‌డ‌ప ఎంపీ సీటు తో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ వైసీపీ బంప‌ర్ మెజార్టీ తో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక 2014 ఎన్నిక ల‌లో వైసీపీ ఏపీలో గెల‌వ‌లేదు. అయితే క‌డ‌ప జిల్లాలో మాత్రం ఒక్క రాజంపేట సీటు మిన‌హా అన్ని సీట్ల లోనూ బంప‌ర్ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో వైసీపీ కంచు కోట‌లకు బీట‌లు వారుతున్నాయి. ఆ పార్టీలో ఉన్న కీల‌క నేత‌లు అంద‌రూ అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి స‌పోర్ట్ చేసిన సీనియ‌ర్ల‌తో పాటు రాజ‌కీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా స్త‌బ్ధుగా ఉన్న నేత‌లు కూడా ఇప్పుడు వైసీపీకి టాటా చెప్పేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్టులో మాజీ మంత్రి, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా ఉన్నారు.

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రి గా కూడా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల‌లో ఆయ‌న వైసీపీకి స‌పోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న్ను అస‌లు వైసీపీ వాళ్లు ప‌ట్టించు కోవ‌డం లేదు. దీనికి తోడు రాష్ట్రంలో ప్ర‌భుత్వ ప‌ని తీరు చూసి విసిగి పోయిన ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే డీఎల్ జిల్లాలో వైసీపీ లో ఉన్న అసంతృప్త నేత‌ల‌తో పాటు జిల్లాలో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో ప్రాధాన్యం లేని నేత‌ల‌ను క‌లుపుకుని చంద్ర‌బాబును క‌లిసేందుకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా క‌డ‌ప జిల్లాలో వైసీపీ కోట‌ల‌కు బీట‌లు వారేందుకు బీజం ప‌డుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: