హుజూరాబాద్‌లో షాకింగ్ రిజల్ట్స్.. బంపర్ మెజార్టీ పక్కా...!
అయితే తెలంగాణలోని హుజూరాబాద్ లో గట్టి పోటీ ఉంది. దీంతో అధికారులు ఇప్పటికే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించడంతో ఎవరికి వారు రకరకాలుగా చర్చించు కుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వారు రకరకాలుగా ఎవరిది గెలుపు అనే దానిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. మరోవైపు ఈ సారి హుజూరా బాద్ లో అధికార పార్టీకి షాకింగ్ ఫలితాలు తప్పవనే చాలా మంది సోషల్ మీడియా చర్చల్లో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ ఎస్ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థి బలం అని అనుకుంటున్నా అదే ఈటలకు ప్లస్ అవుతుందని అంటున్నారు. కేసీఆర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్పుడు ...ఈటలపై పోటీకి సీనియర్ అయితే బాగుంటుందని కొంతమంది సూచించినా ఆయన ఒప్పు కోలేదట. అయితే ఇప్పుడు ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగడనే అంటున్నారు.
ఇక ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా కొత్త క్యాండెట్‌ను పెట్టారు. అది కూడా పరోక్షంగా ఈటలకే ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.కాంగ్రెస్ వాళ్లు కూడా ఇప్పుడు తాము గెల వక పోయినా టీఆర్ ఎస్ గెలవకూ డదని అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తోన్న వారు ఈటల కనీసం 30 వేలకు తగ్గకుండా మెజార్టీ తో గెలుస్తాడని లెక్కలు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.