మా ఊరు మా వార్త : కూర‌గాయలు లేవు సర్!

RATNA KISHORE
పంట‌ల్లేక మా ఊరు రైతులు చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. పంట‌లు పండినా చేతికి రాక మా ఊరు రైతులు నానా గ‌గ్గోలు పెట్టారు. జ‌గ‌న్ అన్న మాత్రం మా ఊరిని ఎందుక‌నో ప‌ట్టించుకోడు. గులాబ్ తుఫాను మా జీవితాల‌ను అత‌లాకుత‌లం చేశాయి. అయినా కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ స‌ర్కారు పెద్ద ఇటుగా రాలేదు. ఏరియ‌ల్ స‌ర్వే అన్న‌ది చేప‌ట్ట‌నే లేదు. క‌నీసం మాకు వ్య‌వ‌సాయ శాఖ చూసే గ్రేట్, గ్రేటెస్టు పెర్స‌న్ క‌న్న‌బాబు ముఖం అయినా చూసే భాగ్యం ఉందో లేదో అన్న‌ది ఓ డౌట్ ... మా ఊరు అంటే శ్రీ‌కాకుళం అని అర్థం.

మా ఊరికి వాన గండం ఉంది. గులాబ్ తుఫాను త‌రువాత కూడా వాన‌లొస్తునే ఉన్నాయి. మా ఊరు అంటే శ్రీ‌కాకుళం అని అర్థం. మా ఊరు అంటే తూరు ప్రాంతంకు చెందిన ఊరు అని కూడా అర్థం. మా ఊరికి అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో వాన‌లొస్తున్నాయి. ఇవి మంచి  చేస్తాయో లేదో అన్న దిగులులో రైతులు ఉన్నారు. ఇప్ప‌టికే మొన్న‌టి తుఫాను కార‌ణంగా పంట‌లు నీట‌మునిగాయి. పంట న‌ష్టం వాటిల్లింది. వీటిపై కేంద్రానికి జ‌గ‌న్ అడిగిందీ లేదు చేసిందీ లేదు. తుఫాను వ‌చ్చిన‌ప్పుడు మాత్రం మోడీ తెలుగులో ఓ సందేశం సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు  చేసి న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అటుపై మాత్రం నా సంగ‌తి మ‌రియు నా ఊరు సంగ‌తి మ‌రిచే పోయారు. నా అన‌గా నా ప్రాంతానికి చెందిన రైతు గోడును మ‌రిచి పోయినారు అని అంటున్నాను. నా అనే విస్తృతంలో కొన్ని మాట‌లు రాయాలి. ప్ర‌స్తుతం మార్కెట్  కూర‌గాయ‌ల‌కు అనుకూలం కానీ పంట చేతికి వ‌చ్చేలోగానే ఏదేదో జ‌రిగిపోతోంది. రోజుకు మా జిల్లాకు 672 మెట్రిక్ ట‌న్నుల కూర‌గాయలు కావాలి కానీ మార్కెట్ కు  150 నుంచి 200 ట‌న్నులే వ‌స్తున్నాయి అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఈ నేప‌థ్యంలో  మా ఊళ్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. అయినా కూడా మా జ‌గ‌న్ అన్న రైతుల‌ను ఆదుకోడు. కూర‌గాయ‌ల సాగును ప్రోత్స‌హించ‌డు. ధ‌ర‌ల‌ను దార్లోకి తేడు.  ఇవ‌న్నీ మా తిప్ప‌లు.. మా తిప్ప‌ల్లో మేమున్నాం అనుకుంటే ఇదిగో నిన్న వాన వ‌చ్చి పుట్టి ముంచింది. ఈ వాన  చేసే న‌ష్టం ఎంతో ఇంకా అంచ‌నా లేదు. పోనీ మాయ‌దారి వాన భూగ‌ర్భ జ‌లాల‌ను అయినా పెంచిందో లేదో అన్న సందిగ్ధం అయితే ఇంకా వీడ‌నే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: