యోగి రికార్డులు.. గెలిపిస్తాయో లేదో?

praveen
దారుణమైన నేరచరిత్ర కు కేరాఫ్ అడ్రస్గా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాధ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అక్కడ పరిస్థితుల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఒక సన్యాసి అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడులే అని విమర్శించిన వారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యక్తి కావాలి అని ప్రశంసించే విధంగా యోగి ఆదిత్యనాథ్ పాలన సాగించారు.  నేరస్థుల చెప్పుచేతుల్లో ఉండే రాజకీయాలను రూపుమాపి నేరస్తులనే లేకుండా చేసాడు. ఎక్కడికక్కడ నేరస్తులను ఎన్ కౌంటర్ చేస్తూ నేర చరిత్రకు కేరాఫ్ అడ్రస్ అయిన రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు.



 ఒకప్పుడు శాంతిభద్రతలు అంటే ఎలా ఉంటాయో తెలియని అక్కడి ప్రజలకు నేరాలను అరికట్టే శాంతిభద్రతలు మధ్య ఎంతో ధైర్యంగా బ్రతికే విధంగా భరోసా తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. పాలన  విషయంలోనే కాదు అభివృద్ధి విషయంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించారు అని చెప్పాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 51 కొత్త గవర్నమెంట్ కాలేజీలను కట్టించారు. 59 జిల్లాలో మెడికల్ కళాశాలలు కట్టించారు.  28 కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు,  4 రాష్ట్ర యూనివర్సిటీలు కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు.  అంతేకాకుండా 9 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించారు. ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఇన్ని చేసిన యోగి ఆదిత్యనాథ్ కి రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ కలిసి వస్తాయా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువగా హావ భావాల మధ్య జరుగుతూ ఉంటాయి. చిన్నచిన్న హావభావాలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  మరి ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అభివృద్ధి గెలుస్తుందా లేదా హావభావాల రాజకీయాలు గెలుస్తాయా అన్నది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: