హుజురాబాద్ చిత్రం.. ఈటల కు జై కొట్టిన టిఆర్ఎస్ నేతలు?

frame హుజురాబాద్ చిత్రం.. ఈటల కు జై కొట్టిన టిఆర్ఎస్ నేతలు?

praveen
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడి వేడి గా మారిపోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులందరూ ప్రస్తుతం ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.ముమ్మర ప్రచారం కూడా చేస్తూ ఉండటం గమనార్హం. అయితే అటు ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే అటు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ విజయం సాధిస్తారా లేక కేసీఆర్ తన పరువు నిలబెట్టుకోవడానికి తనదైన వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.



 ఈ క్రమంలోనే టిఆర్ఎస్ స్థానిక నేతలు అందరూ ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రసంగాలు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కానీ కొంతమంది టిఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా కన్ఫ్యూషన్ లోనే ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక ఆ కన్ఫ్యూషన్ అటు కేసీఆర్కు మైనస్ గా మారే అవకాశం ఉంది. ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.  టీఆర్ఎస్ నేతల ప్రసంగాలు ఇచ్చిన తర్వాత బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు జేజేలు కొట్టారు.



 ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ఇటీవలె సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన ఎంతోమంది కూడా భిన్నమైన కామెంట్లు ఉండటం గమనార్హం.  టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని తెరాస అభ్యర్థి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అంటూ ఒక టిఆర్ఎస్ నేత మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత తన ప్రసంగాన్ని ముగించే సమయంలో జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీకి జై కొడతాడు ఆయన. ఇక ఆ తర్వాత నాలుక కరుచుకుని జై ఈటెల అంటూ మరోసారి బిజెపి నేత ఈటలకు జై కొడతాడు.  ఇక పక్కనే ఉన్న వారు పరువు పోతుందని భావించి ఏకంగా ఆయన దగ్గరనుంచి మైక్ లాక్కుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: