ప్రజలు తక్కువ తినాలని కామెంట్స్ చేసిన పాకిస్తాన్ మంత్రి..

Purushottham Vinay
చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా గడ గడ వణికించడం అనేది జరిగింది. ఇంకా కూడా ఈ వైరస్ అన్ని దేశాలను వణికిస్తుంది. ప్రజలను తీవ్రంగా భయబ్రాంతులను చేస్తుంది.కరోనా మహమ్మారి ప్రభావం వల్ల చాలా దేశాలు కూడా ఆర్ధికంగా ఎన్నో నష్టాలను చవి చూడటం అనేది జరిగింది. ఇక కొన్ని దేశాల పరిస్థితి అయితే మాత్రం చాలా దీనంగా అయిపోయింది. ఇక భారతదేశంలో కూడా చాలా కుటుంబాలు ఈ మహమ్మారి కారణంగా రోడ్డున పడటం అనేది జరిగింది..ఇక కరోనా వైరస్ మహమ్మారి తర్వాత కూడా చాలా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవడం అనేది ఇప్పటికీ కూడా ఆగకుండా జరుగుతుంది. అందులో ఎన్ని దేశాలు ఉన్నాకాని బాగా ఎదురుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని చెప్పాలి.పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు అనేవి బాగా పెరిగిపోయి అసలు ఆకాశాన్ని చాలా దారుణంగా తాకుతున్నాయి.

ఇక పెరుగుతున్న ఈ నిత్యావసర ధరల పైన ఆ దేశ కేంద్ర మంత్రి అలీ అమిన్ గందపూర్ షాకింగ్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ఇక ఆ ధరల పెరుగుదల దృష్ట్యా అక్కడ ప్రజలు తక్కువ తినాలని ఆయన సూచించడం జరిగింది.ఇక అలాగే ద్రవ్యోల్భణం గురించి ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఈ పాకిస్తాన్ కేంద్ర మంత్రి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా కోలుకోలేని షాక్ కి గురి చేసింది.ఇక చక్కెర ఇంకా అలాగే పిండి పదార్థాల ధరలు కూడా బాగా పెరుగుతున్నందున ప్రజలు వీటిని తినడం తగ్గిస్తే మంచిదని ఆయన అన్నారు. ఇక ద్రవ్యోల్బణం గురించి చెబుతూ ప్రజలు పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి త్యాగాలు చేయాలని పాకిస్తాన్ కేంద్ర  మంత్రి కోరారు. ఇక ఈ పాకిస్తాన్ కేంద్ర మంత్రి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు చాలా అంటే చాలా వివాదాస్పదంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: