పిఎఫ్ ఖాతాదారులకు దీపావళికి బంపర్ ఆఫర్..

Purushottham Vinay
ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త ఉంది. కోట్లాది మంది సబ్‌స్క్రైబర్‌ల కోసం ఈ దీపావళిని ఈ సంస్థ మరింత ప్రత్యేకంగా చేసే అవకాశం ఉంది.ఇక నివేదికల ప్రకారం, EPFO త్వరలో 2020-21 సంవత్సరానికి 6 కోట్లకు పైగా చందాదారుల ఖాతాలపై వడ్డీని వారి బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇక విశేషమేమిటంటే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి PF పై 8.5 శాతం వడ్డీని బదిలీ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ కూడా ఈ నిర్ణయానికి సమ్మతిని తెలియజేయడం అనేది జరిగింది.ఇక ఇప్పుడు, EPFO త్వరలో చందాదారుల ఖాతాలలో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది.ఇక దీపావళికి ముందు ఉద్యోగుల ఖాతాకు డబ్బు బదిలీ చేయవచ్చని వారు చెబుతున్నారు.2020-21 ఆర్థిక సంవత్సరానికి కేవలం 8.5 శాతం మాత్రమే వడ్డీ రేటును కొనసాగించాలని EPFO నిర్ణయించింది, ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటు ఒకే విధంగా ఉంది.


అదే సమయంలో, 2019 సంవత్సరంలో EPF పై 8.65 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ఇంకా 2018 లో 8.55 శాతం వడ్డీ ఇవ్వబడింది. వాస్తవానికి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో, KYC లో సమస్యల కారణంగా, చాలామందికి 8 నుంచి 10 నెలలు తర్వాత వడ్డీ వచ్చింది. మరోవైపు, EPFO తన ఖాతాదారులకు ఏదైనా నకిలీ కాల్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది.EPFO తన ఖాతాదారుల నుండి UAN నంబర్, ఆధార్ నంబర్, PAN నంబర్ లేదా బ్యాంక్ వివరాలను ఫోన్ కాల్‌లలో ఎన్నడూ అడగదు, లేదా EPFO తన ఖాతాదారునికి ఎలాంటి ఫోన్ కాల్ చేయదు.మీ ఖాతాకు వడ్డీ మొత్తం క్రెడిట్ చేయబడిందో లేదో తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. EPFO నుండి వడ్డీ బదిలీ గురించి సమాచారం ప్రతి చందాదారునికి మెసేజ్ ద్వారా ఇవ్వబడుతుంది. కానీ, మీరు మెసేజ్ ని పంపడం ద్వారా ఖాతాలో బ్యాలెన్స్ సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్‌లో 'EPFOHO UAN ENG' అని టైప్ చేసి 7738299899 కి పంపాలి. మెసేజ్ చివరి మూడు అక్షరాలు భాష కోసం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: