ఈటల వ్యూహమేంటి.. విజయం వరిస్తుందా..?

MOHAN BABU
 గత కొద్దిరోజుల నుంచి ఎంతో ఉత్కంఠగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో ప్రచార హోరు కొనసాగుతోంది. అయితే ఈటల రాజేందర్ మాత్రం  ఎన్నికల నోటిఫికేషన్ ముందునుంచే  తన ప్రచారాన్ని ప్రారంభించారు. హుజురాబాదు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ గ్రామాన ఇప్పటికే ఆయన ప్రచారాన్ని చేశారు. ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఈటల రాజేందర్ కు ఉన్నది. కానీ ఈటల రాజేందర్ కెసిఆర్ ఎత్తుల ముందు నిలబడి విజయం సాధిస్తారా..  లేదా బంగ పడతారా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది.. అసలు హుజురాబాద్లో  ఏం జరుగుతుందో.. తెలుసుకుందామా.?


ఈటల రాజేందర్ ప్రచారంలో కెసిఆర్ ను తీవ్రంగా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన తప్పులను అసెంబ్లీలోనే తెలంగాణ తరఫున మందలించిన ఏకైక వ్యక్తిని అని ఆనాడు అంతమంది ఆంధ్ర నాయకుల ముందు భయపడని ఈటల రాజేందర్, తెలంగాణ కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకూ అలుపెరుగని పోరాటం చేసిన నేను ఇప్పుడు నీ బెదిరింపులకు భయపడతానా అని కడిగిపారేశారు. ఆ సమయంలోనే  నన్ను నయీం ముఠా ద్వారా చంపించాలని చూశారని కానీ నేను ఎక్కడ బెదర లేదని తెలంగాణ కోసం నా ఛాయ శక్తుల కృషి  చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకూ  ముందుండి పోరాడానని తెలియజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన హుజరాబాద్ లో విజయం ఈటెల రాజేందర్ దే అని ఆయన అన్నారు. దళిత బంధు రావాలంటే, చికెన్ సెంటర్ నడవాలంటే, మీ కిరాణం  నడవాలంటే, మీ పని ఏది సాగాలన్న టిఆర్ఎస్ జండా కప్పు కోవాలా బిడ్డ అంటూ తీవ్రంగా విమర్శించారు.


 తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారని ఇక మీకు రోజులు దగ్గర పడ్డాయని రాబోవు రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని, 2023 ఎలక్షన్లలో  తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఈటల రాజేందర్ అన్నారు. ఇలా ఆయన ప్రచారంలో వ్యూహాత్మకంగా మాట్లాడుతూ  ప్రచార హోరును కొనసాగిస్తూ, ప్రజలకు భావోద్వేగ ప్రసంగాన్ని అందిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: