రష్యా వణికిపోతుంది.. ఎందుకో తెలుసా?

praveen
కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న సమయంలో ఇక అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయోగాల మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాల కంటే ముందుగా అగ్రరాజ్యమైన అమెరికా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ అంతలోనే ఊహించని విధంగా  రష్యా తాము వ్యాక్సిన్ కనుగొన్నాను అంటూ స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ ను తెరమీదకు తీసుకు వచ్చింది. అప్పటి వరకు ఎక్కడా ప్రస్తావన లేని వ్యాక్సిన్ ఎలా తెరమీదికి వచ్చింది అనే దానిపై మాత్రం అందరూ అయోమయంలో పడిపోయారు.


 కనీసం రష్యాకు చెందిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అయినా పూర్తి చేసుకుందా లేదా అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని రష్యాకు చెందిన వ్యాక్సిన్ తీసుకునేందుకు  ఎవరు ముందుకు రాలేదు.  అయితే అటు రష్యా కూడా  వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టకపోవడం ఇక మరింత అనుమానాలను కలిగించింది. కానీ తమ దేశపు వాక్సిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని..  ప్రపంచంలో వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి దేశంగా తామే ఉన్నాము అంటూ గొప్పలు చెప్పుకుంది.  రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్  భారత్లో కూడా అనుమతి పొందడం గమనార్హం. కేవలం ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఇక ఈ వ్యాక్సిన్ను అందజేస్తున్నాయి.



 అయితే రష్యా తెరమీదకు తీసుకువచ్చిన వ్యాక్సిన్ మాత్రం అంత సమర్థవంతంగా పని చేయడం లేదు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే రష్యా తమ దేశ ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. కానీ రష్యాలో కరోనా వైరస్ కేసులు సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక రష్యాలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయి అంటే ఏకంగా రోజుకు వెయ్యి మంది వరకు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా తమ దేశపు వ్యాక్సిన్ ఎంతో గొప్పది అని చెప్పుకుంటున్న రష్యా ఇక ఆ వ్యాక్సిన్లు నమ్ముకొని చివరికి ఇప్పుడు నట్టేట ములుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: