జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మరోవైపు A2 గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయి రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందుగా ఈడీ కేసులపై విచారణ జరపాలన్న సిబిఐ ఈడి కోర్టుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ కేసులతో సంబంధం లేకుండా ఈడి కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టవచ్చంటూ సీబీఐ కోర్టు జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ లొకేషన్స్ విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్, విజయ్ సాయి రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కేసులో నిర్దోషిగా విడుదల అయితే దాని ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ కేసు నిలబడదని వాదించారు.
అయితే హైకోర్టు మాత్రం కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ విజయసాయిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. మరోవైపు A2 గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. మరోవైపు విజయనగరం మానసాస్ ట్రస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హై కోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్ గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆయనను జైలుకు పంపుతామని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోర్టు దిక్కారనే అవుతుందని అన్నారు. బెయిల్ కండిషన్ను పదేపదే ఉల్లంఘించడం, సోషల్ మీడియాలో జ్యుడిషియల్ వ్యవస్థపై వైసీపీ కార్యకర్తల పోస్టులకు భరోసా ఇవ్వడాన్ని కూడా రఘు రామ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇక పిటిషనర్ గా తాము విజయసాయి రెడ్డి కి నోటీసులు పంపిస్తే తిరస్కరించారని కోర్టు ఆర్డర్ ఇస్తేనే నోటీస్ తీసుకుంటామని తెలిపారంటూ కోర్టుకు రఘురామ లాయర్ తెలిపారు. దీంతో విజయసాయి రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పిటిషనర్ ఇచ్చిన నోటీసులకు సిబిఐ స్పందించింది.మీరెందుకు తీసుకోలేదంటూ కోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి అధికారులు విజయసాయిరెడ్డికి ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.