ఊహించని పరిణామం.. తాలిబన్లతో ఆ దేశం చర్చలు?

praveen
ఉగ్రవాదులు అందరూ కోరుకునే మత రాజ్యస్థాపన ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు ఇటీవల ఆయుధాలు చేతబట్టి ఆఫ్ఘనిస్థాన్ ను తమ వశం చేసుకున్నారు. ఇక ఇటీవలే ఏకంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు తమ చట్టాల్లో మార్పులు తీసుకువస్తామని మహిళలను బానిసలుగా చూడము అంటూ ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు మాత్రం వారి అసలు రంగు బయట పెడుతున్నారు తాలిబన్లు. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ ఆధిపత్యాన్ని చేపట్టిన నాటి నుంచి అన్ని దేశాలతో సంబంధాలు తెగిపోయాయ్.

 దీంతో ఆఫ్ఘనిస్థాన్లో రోజురోజుకీ అన్నిరకాల సంక్షోభాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్లో ఆహార సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు అని చెప్పాలి.  ఇలాంటి సమయంలో అటు ఆప్ఘనిస్థాన్లో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఎలా చూడు పోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇలాంటి సమయంలో మొన్నటి వరకూ ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ శబదాలు చేసిన అగ్రరాజ్యాలే ఇక ఇప్పుడు తాలిబన్ల బ్లాక్ మెయిల్ కి లొంగి పోతున్నట్టుగా తెలుస్తోంది.

 ఇటీవలే అగ్రరాజ్యాల లో ఒకటైన బ్రిటన్ కి చెందిన దౌత్య నేతలు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ తాలిబన్లతో చర్చలు జరపడం ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నాయి బ్రిటన్ పౌరులను వదిలేయాలంటే తమకు సహాయం చేయాలని అది కూడా మానవతా దృక్పథంతో చేస్తున్నట్లుగా చేయాలి అంటూ తాలిబన్లు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇక బ్రిటన్ లొంగిపోయి సహాయం చేసేందుకు సిద్ధమైందని విశ్లేషకులు అంటున్నారు. అగ్రరాజ్యాలే ఉగ్రవాదులకు ఇలా లొంగిపోతే ఇక చిన్న చిన్న దేశాలు పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: