జిన్ పింగ్ ని బ్రతిమిలాడిన బైడెన్.. ఎందుకో తెలుసా?
ముఖ్యంగా స్వతంత్ర దేశంగా ఉన్న తైవాన్ ను తమ దేశం లోని భూభాగమే అంటూ చైనా స్టేట్మెంట్లు ఇవ్వడం.. సంచలనంగా మారింది. తాము ఏ దేశంలో భాగం కాదని తాము ప్రత్యేక దేశం అంటూ తైవాన్ చురకలు అంటించింది. ఈ క్రమంలోనే అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అటు తైవాన్ కు అండగా నిలిచింది. ఇక ఈ రెండు దేశాల మధ్య తైవాన్ విషయంలో కూడా ఒప్పందం ఉంది. కానీ ఇటీవలే ఏకంగా తైవాన్ గగనతలంలో కి చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారీ రేంజ్లో విహారం చేయడం సంచలనంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లో చైనా తైవాన్ ను ఆక్రమించుకో పోతుంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో అగ్రరాజ్యానికి అధిపతిగా ఉన్న బైడెన్ చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయడం వదిలేసి ఏకంగా చైనాను అడుక్కోవడం మొదలుపెట్టారు. ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేశారట. తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉందని దానిని గుర్తుంచుకోవాలని సూచించాడట బైడెన్. ఒకప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కనీసం తైవాన్ జోలికి వెళ్లని చైనా.. ఇక ఇప్పుడు చైనా మానస పుత్రుడిగా పేరున్న జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాత్రం రెచ్చిపోతుంది. దీంతో విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ ను నిండా మంచినట్టు గానే తైవాన్ విషయంలో కూడా చేతులెత్తయ్యపోతున్నాడు అని అంటున్నారు.