ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా నడుస్తోంది హుజూరాబాద్ నియోజకవర్గం లో. ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు నియోజకవర్గం అంతా, మండలాలు చూసిన , గ్రామాల తిరిగిన ఒకటే వాస్తవ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 70 శాతం ప్రజలు ఒక వైపు ఉన్నారు. ఇంకో 20,30 శాతం మంది వేరే వైపు ఉన్నారు. కెసిఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలుగా దీన్ని మనం చూడాలని స్పష్టంగా చెబుతున్నారు. భారతదేశ చరిత్రలో ఇంత చీకటి అధ్యాయాన్ని మళ్ళీ ఎప్పుడు చూడలేదు. 5 నెలల నాలుగు రోజుల్లో వందల కోట్ల రూపాయలతో ని నాయకులను ప్రలోభ పెట్టడం, ప్రజలను నేరుగా కుల సంఘాల పేరుతో దావత్ లకు పిలిపించుకోవడం, అనేక రూపాల్లో డబ్బులు పంపిణీ చేయడం, ఒక మాటలో చెప్పాలి అంటే ఐదు నెలల నాలుగు రోజుల కాలంలో డబ్బులు,మద్యం, మంత్రుల అహంకారం, ప్రలోభాలు, భయ పెట్టించడం కూడా కొనసాగుతున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు.
ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నా హుజురాబాద్ ఆడబిడ్డలు, అన్నలు మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని, అహంకారాన్ని కచ్చితంగా ఓడ కొడతాం, పైసలతో, మద్యంతో, ప్రలోభాలతో మా హుజురాబాద్ ప్రజల్ని వంచించే లేరని చెప్పి మేము భావిస్తున్నాం అని ఈటెల రాజేందర్ గారు అన్నారు. నాయకులంతా ఒకవైపు, ప్రజలంతా ఒకవైపు ఉన్నారన్నారు. ఊరంతా ఒక దారి ఊసరవెల్లి మరో దారి అన్న తీరుగా ఉన్నారు. ఎన్ని చేసినా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని, ఇక్కడ గెలిచే గుర్తు పువ్వు గుర్తెనని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ కూడా నాయకులు చరిత్ర నిర్మించ లేరని ప్రజలే చరిత్ర నిర్మాతలని ఆయన అన్నారు.
నియోజకవర్గ ఆడబిడ్డలంతా నువ్వేం చిన్నబోకు రాజన్న మేము నిన్ను నిలబెట్టుకుంటాం, కాపాడుకుంటాం అని అన్నారని ఆయన తెలియజేశారు. గ్రామ గ్రామానికి వచ్చి పబ్బతి పట్టిన ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరని చెప్పారు . కెసిఆర్ తీరు ఒడ్డెకాదాకా ఓడ మల్లప్పా ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అనే తీరు లో ఉంటుందని ఈటెల అన్నారు. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని, కానీ కేసీఆర్ ఓడిపోతే కచ్చితంగా రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు.