కరోనా బాధిత కుటుంబాలకు రూ.50వేలు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు !

Veldandi Saikiran
భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారందరికీ ఎక్స్ గ్రేషియా కింద రూ .50,000 ల పరిహారం మంజూరు చేసే కేంద్ర పథకాన్ని ఆమోదించింది సుప్రీం కోర్టు.  కోవిడ్ -19 బాధితులకు ఎక్స్ గ్రేషియా పరిహారం చెల్లించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్‌డిఎమ్‌ఎను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల ని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్ప ఇచ్చంది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరణించిన వారి సమీప బంధువులకు రూ .50 వేలు చెల్లించాల్సి ఉంటుందని  స్పష్టం చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా. 

 మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణం కోవిడ్ -19 కాదనే కారణంతో రూ .50,000 ప్రయోజనాన్ని ఏ రాష్ట్రం తిరస్కరించదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం... మరణానికి కారణాన్ని సరిచేయడానికి జి ల్లా అధికారులు సహాయక చర్యలు తీసుకుంటారు, ప్రింట్ మీడియాలో జిల్లా స్థాయి కమిటీ వివరాలు ప్రచురించాలి అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాష్ట్ర విపత్తు సహాయ నిధుల నుండి చెల్లింపు ఉంటుంద ని  తెలిపిన ధర్మాసనం... దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా పరిహార మొత్తా న్ని పంపిణీ చేయాలి మ యు మరణానికి కారణం కోవిడ్ -19 గా ధృవీకరించబడాలని పేర్కొంది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ తర్వాత సంభవించే మరణాలకు ఎక్స్ గ్రేషియా సహాయం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఫిర్యాదు పరిష్కార కమిటీ మరణించిన రోగి యొక్క వైద్య రికార్డులను ప రిశీలించి, 30 రోజుల్లోపు కాల్ చేసి పరిహారాన్ని అందించవచ్చని తెలిపిన సుప్రీంకోర్టు... హాస్పిటల్స్ నుండి రికార్డుల కోసం కాల్ చేయడానికి కమిటీకి అధికారం ఉంటుందని పేర్కొంది కోర్టు. కోవిడ్ -19 తో మరణించిన వారి కుటుంబాలకు రూ .50,000 ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సిఫా రసు చేసిందని గత నెలలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేంద్రప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: