ఆ మంత్రి ప్లేస్... ఆయన సతీమణికేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?
ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న బొత్స.. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర సారథిగా కూడా పనిచేశారు. ఇక, ఆయన సతీమణి.. ఝాన్సీ కూడా గతంలో ఒకసారి ఎంపీ అయ్యారు. అయితే.. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున టికెట్ ఆశించినా.. దక్కలేదు. ఇప్పుడు.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఇకపై ఉండబోనని.. తనను రాజ్యసభకు పంపాలని.. బొత్స.. జగన్ను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సతీమణికి.. ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన ప్లేస్లో ఆమెను నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా.. మంత్రి వర్గంలోనూ చోటు కోసం.. చూస్తున్నారు. ఇంతవరకుబాగానే ఉన్నా.. వైసీపీ అధినేత జగన్ ఆలోచన మరోవిధంగా ఉందని అంటున్నారు.
బొత్స కుటుంబానికి ప్రత్యక్ష రాజకీయాల్లో స్థానం కల్పిస్తూనే.. ఆయన సతీమణికి కాకుండా.. కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమేనని అంటున్నారు. దీనికి బొత్స తటపటాయిస్తున్నారు. తన సతీమణిని ముందుకు తీసుకువచ్చి.. తర్వాత.. తన కుమారుడికి కూడా అవకాశం ఇప్పించుకోవాలని ఆయన ప్రయత్నంగా ఉంది. ఇదే విషయం చర్చకు వచ్చింది. ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచి చాలా మంది నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికిప్పుడు తన కుమారుడిని అరంగేట్రం చేయిస్తే.. తన సతీమణికి ప్రాధాన్యం పోవడంతోపాటు..తన వ్యూహంగా ఉన్న రెండు టికెట్లు దక్కే అవకాశం లేదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను రాజ్యసభకు పంపి.. తన సతీమణికే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.