వామ్మో.. అతను కూడా అప్డేట్ అయిపోయాడుగా?

praveen
ఒకప్పుడు ఎలాంటి ఆర్థిక పరమైన కార్య కలాపాలు జరపాలి అన్న కూడా నగదును బదిలీ చేసుకునే వారు.  రోజు రోజుకూ టెక్నోలజీ పెరిగి పోతుంది . మారుతున్న టెక్నాలజీ మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమం లోనే ప్రతి ఒక్కరూ టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు.  ఈ క్రమం లోనే నేటి రోజుల్లో ఆన్లైన్ పేమెంట్స్ హవా నడుస్తోంది అని చెప్పాలి.  అయితే మొన్నటి కేవలం కొంత మందికి మాత్రమే ఆన్లైన్ పేమెంట్ అందు బాటులో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం  సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పేమెంట్ అందుబాటు లోకి వచ్చేశాయి.



 ఇకపోతే ఇక ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఎలాంటి కార్య కలాపాలు జరిపిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ఇక డబ్బులు పంపించడం లాంటివి చేస్తున్నారు ప్రతి ఒక్కరు.  పెద్ద పెద్ద జ్యూయలరీ షాపుల దగ్గర నుంచి బడ్డీ కొట్టు వరకు కూడా ప్రస్తుతం ఇలా అన్ని చోట్లా క్యూఆర్ కోడ్ దర్శనమిస్తున్నాయి.  ఇలా ప్రతి ఒక్కరు కూడా అప్ డేట్ అయి పోతున్నారు.  ఇక్కడ ఒక వ్యక్తి కూడా అప్డేట్ అయి అందరినీ అవాక్కయ్యేలా  చేశాడు. సాధారణం గా ఊర్లోకి బసవన్న ఆటలాదించే వారు వస్తారు బసవన్న తో ఆడించి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటారు.


 కానీ ఇక ఇటీవలే బసవన్న లు ఆడించే వ్యక్తి కూడా అప్డేట్ అయ్యాడు  ఏకం గా ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకుని అది బసవన్న తలపై పెట్టి ఊరు తిరుగు తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ఇక ఈ ఫోటో చూసిన వాళ్ళు వామ్మో అతను కూడా అప్డేట్ అయి పోయాడు గా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: