తుఫాను ఎఫెక్టు : రంగంలోకి కేంద్రం? జగన్ మొర వినేనా!

RATNA KISHORE
తుఫాను కారణంగా జగన్ ప్రభుత్వం మరింత గందరగోళంలో పడిపోయింది. రోడ్ల నిర్మాణాలకు కానీ మరమ్మతులకు కానీ నిధులు ఎక్కడి నుంచి తెచ్చేదని అధికార యంత్రాంగం నాయకులతో వాగ్వాదం పడుతోంది.



తుఫాను ప్రభావిత ప్రాంత వివరాలను, సంబంధిత చర్యలను ముఖ్యమంత్రి జగన్ ను కేంద్రం అడిగి తెలుసుకుంది. తామేం చేయా లో కూడా చెప్పమని అడిగింది. సీఎంతో సహా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తన గోడు వినిపించా రు. ముఖ్యంగా ఒక్క విద్యుత్ రంగానికే ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కానీ ఇప్పటిదాకా ఇంకా సహాయక చర్యలు పూర్తికాలేదు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఇలా చాలా సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయింది. అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేల కూలిన కారణంగా రోడ్లు  కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇవి కూడా బాగు చేయాలి వెంటవెంటనే అని ప్రజలు కోరుతున్నారు. చెట్లు తొలగించి రహదారు లను శుభ్రం చేయగలుగుతున్నారేమో కానీ రోడ్ల మరమ్మతులు మాత్రం ఇప్పట్లో  లేనేలేవని తేలిపోతోంది. రైతాంగాన్ని ఆదుకునేందుకే ప్రాధాన్య రంగంగా గుర్తించి నిధులు ఇచ్చేందుకే తమ వద్ద డబ్బుల్లేవని జగన్ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి.  ఈ సమయంలో రోడ్ల మరమ్మతులు నా వల్ల సాధ్యమా అన్న విధంగా సీఎం అంతర్మథనం చెందు తున్నారని టాక్. తీవ్ర తుఫానుల కారణంగా తరుచూ నష్టపోతున్న ఆంధ్రావనిని కేంద్రం ఆదుకున్న దాఖలాలు గతంలోనూ లేవు, ఇప్పుడూ లేవు.



గులాబ్ తుఫాను తీరం దాటి 24 గంటలు గడిచిపోయినా కేంద్రం నుంచి తక్షణ సాయం అందిస్తామని చెప్పారే కానీ, ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. దీంతో రైతాంగం తమకు పంటనష్టంకు సంబంధించి పరిహారం అందుతుందా లేదా అన్న డైలామాలో ఉంది. గతంలో కూడా ఇలానే పంట నష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపినప్పటికీ అక్కడి నుంచి వచ్చిన సాయం అంతంత మాత్రమే అయింది. ఉత్తరాంధ్రకు చెందిన కొన్ని బాధిత ప్రాంతాలను నిన్నటి వేళ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ క్షేత్ర స్థాయిలో సందర్శించినప్పటికీ, కేంద్రం తరఫున ఎటువంటి స్పష్టమైన హామీ ఆయన ఇవ్వలేకపోయారు. పంటనష్టం అంచనా తరువాత పరిహారం ఇప్పిస్తామని కానీ, అందుకు తగ్గ చర్యలు చేపడతాం అని కానీ ఏదీ కూడా చెప్పలేకపోయారు. దీంతో కేంద్రంపై రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: