వైసీపీలో పెద్ద బాంబు పేలుతోందా...!
పదవులు కూడా అయిపోవడంతో ఇప్పుడు పదవులు ఆశిస్తోన్న వారు క్రమ క్రమంగా పార్టీపై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వారిని బట్టి చూస్తే చాలా తక్కువ శాతంలో మాత్రమే అసంతృప్తులు బయటపడ్డారనే అనుకోవాలి. ఎన్నికలకు గట్టిగా మరో రెండేళ్ల టైం మాత్రమే ఉంది. ఇక ఈ రెండేళ్లలో వీరికి వచ్చే పదవులు కూడా లేవు. ఈ లెక్కన చూస్తే రెండేళ్లలో భారీ ఎత్తున అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పదవులు ఇస్తామని చాల ఆమందికి హామీలు ఇచ్చారు. అయితే అధిష్టానమే నేరుగా నిర్ణయాలు తీసుకో వడంతో చాలా మందికి హామీ ఉన్నా కూడా పదవులు రాలేదు. దీంతో వీరంతా ఎమ్మెల్యే లతో పాటు నియోజకవర్గాల ఇన్ చార్జ్‌లు ఇతర నేతలపై మండి పడుతున్నారు.
అసలు నూటికి నూరు శాతం పదవులు అన్ని వైసీపీకి వస్తేనే ఈ రేంజ్‌లో యుద్ధాలు నడుస్తున్నాయి. అదే ఎన్నికలు జరిగి టీడీపీ , జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చి వైసీపీ కి కొన్ని పదవులు వస్తే అప్పుడు నేతల మధ్య ఫైటింగ్ లు ఏ రేంజ్ లో ఉండేవో అన్న సందేహాలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. ఏదేమైనా ఈ రెండేళ్లలో పార్టీ నేతల నుంచి పెద్ద బడబాగ్ని పేలు తుందనే తెలుస్తోంది. అయితే పదవుల పంపిణీ జరుగుతున్నప్పుడు అసమ్మతి, అసంతృప్తి కామన్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.