
బాలయ్య కన్నా.. వెనుకబడిన బాబు.. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి...!
ఇక, చంద్రబాబు రాజకీయాల గురించి చర్చించుకుంటే.. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం.. ఇక్కడ నుంచి వరుస విజయా లు దక్కించుకుంటున్నారు. అభివృద్ధి విషయంలోనూ దూకుడుగా ఉంటున్నారు. ఇక, బాలయ్య, బాబులకు కుటుంబ సంబంధా లు కూడా ఉన్నాయి. ఇద్దరు వరుసకు బావ, బావమరిదే కాకుండా.. వియ్యంకులు కూడా. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య రాజకీయ కంపేరిజన్ వచ్చింది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించినా.. ఆ పార్టీ తరఫున కొందరు పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
ఇదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోను, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ కొందరు టీడీపీ నేతలు విజయందక్కించుకున్నారు.అ యితే.. బాలయ్య నియోజకవర్గంలో ఎక్కువ మంది.. బాబు నియోజకవర్గంలో తక్కువ విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఇది ఆసక్తిగా మారింది. కుప్పంలో కేవలం 3 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే సాధించగా, హిందూపురంలో 7 ఎంపీటీసీలను గెలుచుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 66 ఎంపీటీసీలకుగానూ ముచ్చటగా మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయం దక్కించుకుంది. దీంతో బాబు కన్నా.. బాలయ్య బెటర్ అనే టాపిక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.
ఇంకా చెప్పాలంటే గత సాధారణ ఎన్నికల్లోనూ కుప్పంలో బాబు మెజార్టీ ఘోరంగా పడిపోయింది. ఆయనకు ప్రతి సారి వచ్చే 45 వేల మెజార్టీ ఏకంగా 30 వేలకు పడిపోయింది. అయితే హిందూపురంలో మాత్రం బాలయ్య వరుసగా రెండో సారి గెలిచారు. అంతే కాదు ఆయనకు 2014లో వచ్చిన మెజార్టీ కంటే గత ఎన్నికల్లో మెజార్టీ పెరగడం విశేషం. ఇక ఇప్పుడు స్థానికంలో కుప్పంలో బాబు గ్రాఫ్ మరింత దిగజారింది.