కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు !

NAGARJUNA NAKKA
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కరోనా మృతుల కుటుంబాలకు 50వేల రూపాయలను రాష్ట్రాలు ఇస్తాయని విచారణ సమయంలో సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ పరిహారాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కరోనా సమయంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 4లక్షల 45వేల 768మంది చనిపోయారు.
ఇక దేశంలో గత 24గంటల్లో 15లక్షల 92వేల 395కరోనా టెస్టులు చేయగా.. 26వేల 964మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న కరోనాతో 383మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 4లక్షల 45వేల 768కు చేరింది. కోవిడ్ నుంచి మరో 34వేల 167మంది కోలుకోగా.. రికవరీలు 3కోట్ల 27లక్షల 83వేల 741కు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 3లక్షల 10వేల 989యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 82.65కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకా ఇస్తున్నారు. ఓ ప్రాంతంలో సైకిల్ మీద గ్రామ వీధుల్లో తిరుగుతూ మరీ వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఎలా అరుస్తారో అలా.. వ్యాక్సిన్లు వేస్తామండి.. వ్యాక్సిన్లు.. అంటూ తమ యాసలో పలుకుతూ వెళుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు.. వ్యాక్సినేషన్ మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యాసంస్థల్లో సిబ్బందికి రెండు నెలల్లో టీకాలు ఇవ్వాలనీ.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం టెస్టుల్లో ఆర్టీపీసీఆర్ 10శాతం మాత్రమే జరుగుతున్నాయన్న న్యాయస్థానం..కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక ఏపీ విషయానికొస్తే.. గడిచిన 24గంటల్లో 1,365మందికి పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న 8మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 42వేల 73కు చేరగా.. ఇప్పటి వరకు 14వేల 97మంది ప్రాణాలు కోల్పోయారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: