జగన్ గారు ఆ పిచ్చి వదులుకుంటే బెటర్.. రఘురామ షాకింగ్ కామెంట్స్?
మన ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి కదలడం లేదు. నేను ఢిల్లీ నుంచి కదలడం లేదు ఇద్దరి పరిస్థితి ఒకటే అంటూ వ్యాఖ్యానించారు రఘురాము. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయడంకి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కి సంబంధం ఉంది అని మాత్రం నేను భావించడం లేదు అంటూ తెలిపారు. ప్రత్యేక కారణం లేకుండా సుబ్రహ్మణ్యస్వామి రారు అదేసమయంలో ప్రత్యేక విమానంలో సుబ్రమణ్యస్వామి వచ్చే శక్తి లేదు. మార్గాని భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలపై వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు. ఆవ భూములు, పురుషోత్తపట్నం పథకం భూముల కుంభకోణంలో కోట్లు దోచుకుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. కాకినాడ పోర్ట్ కేంద్రంగా హెరాయిన్ వ్యాపారం జోరుగా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. కాకినాడ పోర్టులో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గరి వాళ్ళు సన్నిహితులకు భాగస్వామ్యం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణంరాజు. సీఎం జగన్ నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ వ్యాఖ్యానించారు. ఆదాయం కోసం కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచించాలని సూచించారు. గురజాడ చెప్పినట్లుగా బట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలి అంటూ చురకలు అంటించారు రఘురామకృష్ణంరాజు. పేర్ల పిచ్చి రంగుల పిచ్చి వదిలించుకోవాలి అంటూ హితవు పలికారు.