నిన్న ఆటో డ్రైవర్.. నేడు కోటీశ్వరుడు?
ఈ క్రమంలోనే అదృష్ట లక్ష్మి తలుపు తట్టి అప్పటివరకు ఒక సామాన్యుడి జీవితాన్ని గడిపిన వ్యక్తి కోటీశ్వరుడు గా మారిపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారాలి అంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం అదే లాటరీ. లాటరీ తీసుకున్నాక అదృష్టం ఉంటే ఇక లక్ష్మీదేవి తలుపు తడుతుంది. అది కూడా మామూలుగా కాదు కోట్ల రూపాయలతో తలుపు తట్టి ఒక్కసారిగా సామాన్యుడిని కోటీశ్వరుడిని చేస్తూ ఉంటుంది. ఇక్కడ కేరళలో ఒక ఆటో డ్రైవర్ కూడా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోయాడు.
ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కోట్లకు అధిపతి గా మారాడు ఒక ఆటో డ్రైవర్. లాటరీలో అదృష్టం కలిసిరావడంతో ధనలక్ష్మి అతని తలుపు తట్టింది. ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో టీఈ 645 465 టికెట్ నెంబర్ కి బహుమతిగా ఎంపికైనట్లు అటు నిర్వాహకులు తెలిపారు. ఈ నెంబర్ కి కొచ్చికి చెందిన ఆటోడ్రైవర్ జయపాల్ దిగా గుర్తించారు. ఇక లాటరీ దక్కడంపై ఆటోడ్రైవర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అతను గెలుచుకున్న 12 కోట్ల లో అన్ని రకాల చార్జీలు ఫోను 7 కోట్ల రూపాయలు అతనికి దక్కుతాయి. ఈ ఏడు కోట్ల రూపాయలలో కొంత డబ్బుతో సొంతింటిని నిర్మించుకుంటా అంటూ ఆటోడ్రైవర్ చెబుతున్నాడు.