శ్రీకాకుళం వార్త : కష్టాల్లో వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టు?

RATNA KISHORE
ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించేందుకు, రైతుల వెతలు తీర్చేందుకు చేపట్టిన వంశధార ప్రాజెక్టుకు ఇప్పటికీ అడ్డంకులు ఉంటూనే ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితుల సమస్య ఒకటి, మరోవైపు ఎగువ రాష్ట్రం చేపట్టనున్న ప్రాజెక్టుల సమస్య మరొకటి. కాస్త శ్రద్ధ వహిస్తే ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఏపీ సర్కారుకు ఆ చొరవ లేని కారణంగా ఎగువ నీరు  ఇక ఇటుగా వచ్చే అవకాశమే లేకుండా ఒడిశా చేస్తున్న పనులు లేదా చేయాలనుకుంటున్న పనులు ఇప్పుడిక మనకు ప్రమాదకారిగా మారాయి. వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో వేగం లేకపోగా, రేపటి వేళ పూర్తి చేసుకున్న దీని నుంచి పూర్తి ఫలాలు రైతులు అందుకునే ప్రసక్తే లేకుండా ఒడిశా చేస్తోంది. నేరడి  బ్యారేజీ నిర్మాణంపై ఇప్పటికే అనేక అనుమా నాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారం కావు. ఒడిశా మనకు అప్పగించాల్సిన భూమి అప్పగించదు.


దీంతో పనులు జరగడం కష్టమే! ఈ దశలో ఒడిశా సుప్రీంను ఆశ్రయించింది. నేరడి బ్యారేజీ పై ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం ఎలా ఉంటుందన్నది ఆసక్తిదాయకం.


వంశధార ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చెందుతుంది. దీంతో పాటు తాగునీటిసమస్యలూ పరిష్కారం అవుతాయి. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 పేరిట చేపట్టిన పనుల్లో కాస్త వేగం తగ్గింది. ప్రస్తుతం ఫేజ్ 2 పనులు జరుగుతున్నా అవి ముందరి వే గంలో లేవు. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు చూపుతున్న శ్రద్ధ కూడా ఏమీ లేదు. దీంతో పాటు ఎగువ రాష్ట్రం ఒడిశా నుంచి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్టుకు అనుసంబధానంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ట్రైబ్యునల్ అనుమతి పొంది నా, ఒడిశా సహకారం లేదు. దీంతో వంశధార ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పై అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఒడిశా ఎగువ ను ఇప్పుడు నిర్ణయించిన ప్రకారమే పనులు చేపడితే ఉత్తరాంధ్రకు అన్యాయమే! ఇంత జరుగుతున్నా కానీ జగన్ మాట్లాడడం లే దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: