జ‌గ‌న్ ఇలాకా : కాంట్రాక్ట‌ర్లు చెప్పిన వెయ్యి కోట్ల క‌థ !

RATNA KISHORE

కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుల‌న్నీ కేంద్రానికో, అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల‌కో క‌నువిప్పు అయ్యాయా? అంటే ఔననే అంటున్నాయి రాష్ట్ర అధికారిక వ‌ర్గాలు. దీంతో అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల నిధుల‌తో ఇక‌పై ఒక్క పనీ ఏపీలో ముందుకు సాగ‌దా? అంటే ఇది కూడా నిజ‌మే అని అంటున్నాయి యంత్రాంగ వ‌ర్గాలు. మొత్తానికి జ‌గ‌న్ మ‌ళ్లీ కేంద్రం బిగించిన ఉచ్చులో ప‌డ్డార‌న్న మాట. అన్న మాట కాదు ఉన్న‌మాటే. నిధుల మ‌ళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియ‌స్ గా ఉంది.దీంతో ఏపీలో జ‌రుగుతున్న ఖ‌ర్చుపై లెక్క అడిగింది.
తాము ఇచ్చిన లేదా ఇప్పించిన వాటిపై ఆడిటింగ్ త‌ప్ప‌నిసరి అని అంటోంది.

డ‌బ్బులు ఏమ‌యినా చెట్ల‌కు కాయ‌వు. ఎవ‌రి డబ్బు అయినా ప‌రిధిలో ఉన్నంత మేర‌కే ఖ‌ర్చుచేయాలి. నిబంధ‌న‌లు దాటి ఖ‌ర్చు చేస్తే అది నేరం. రాష్ట్రాలు గ‌తంలోనూ ఇలానే చేశాయి.గ‌త సీఎం చంద్ర‌బాబు కూడా ఇలానే ఖ‌ర్చు చేసి కొన్ని  చిక్కుల్లో ఇరుక్కు న్నారు కూడా! ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం దాదాపు వెయ్యికోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేంద్రంకు చెప్ప‌కుండా ఖ‌ర్చు చేసింది. దీంతో ఇక‌పై అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు చేప‌ట్టే ప‌నుల‌కు నిధులు బంద్ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించి, త‌ద‌నుగుణ చ‌ర్య‌లూ వేగం చేసింది.
ఇబ్బ‌డిముబ్బ‌డిగా కాసులు ఖ‌ర్చు చేస్తున్న జ‌గ‌న్ కు ఇప్పుడొక కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. త‌నకు న‌చ్చిన వాటికి నిధులు ఖ ర్చు పెట్టుకునేందుకు వీలుగా నిబంధ‌న‌లు లేకున్నా కేంద్రం విడుద‌ల చేసిన లేదా చేయించిన కొన్ని నిధుల‌ను మాత్రం ఆయ‌న ఇష్టారాజ్యంగా వినియోగించుకున్నార‌న్న అభియోగంతో త్వ‌ర‌లో ఏపీ ఆర్థిక శాఖ చిక్కుల్లో ప‌డ‌నుంది. అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ లు చేప‌ట్టే ప్రాజెక్టుల‌కు సంబంధించి ఇక‌పై నిధులు ఇవ్వ‌కూడ‌దని, లెక్క‌లు స‌రిగా లేకుండా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేంద్రం స్ప‌ష్టం చే య‌డంతో జ‌గ‌న్ వ‌ర్గాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. తాము ప‌నులు చేసినా బిల్లుల చెల్లింపు లేద‌ని కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుతో కేంద్రం కూడా అప్ర‌మ‌త్త‌మై వివ‌రాలు కూపీ లాగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రో వారం రోజుల్లో దీనిపై ఏమ‌యినా ఒక స్ప‌ష్ట‌త రావొచ్చు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న ఆర్థిక తంతుపైనా, లావాదేవీల‌పైనా కేంద్రం అలెర్ట్ అయింది. కేంద్ర ఆర్థిక శాఖ ను డిపార్ట్మెంట్ ఎకాన మిక్ అఫైర్స్ విభాగం అప్ర‌మ‌త్తం చేయడంతో దాదాపు వెయ్యి కోట్ల లావాదేవీల‌పై కూపీ లాగుతోంది. అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల ని ధుల‌తో న‌డిచే ప్రాజెక్టుల‌కు విడుద‌ల చేసే నిధుల‌ను (960 కోట్ల రూపాయ‌ల‌ను) కేంద్రంకు లెక్క‌లుచెప్ప‌కుండా ప‌క్క‌దోవ ప‌ట్టించ డం, ఇందుకు సంబంధించి చేప‌ట్టిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు సొమ్ములు చెల్లించ‌క‌పోవ‌డం వంటివి వివాదాల‌కు కార‌ణం అయ్యాయి.

 
దీంతో ఇక‌పై ఒక్క రూపాయి కూడా విడుద‌ల చేయ‌బోమ‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు స్ప‌ష్టం చేశాయి. కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుతోనే మొత్తం విష‌యం వెలుగు చూడ‌డంతో జ‌గ‌న్ పూర్తి స్థాయిలో నిధుల వినియోగంపై లెక్క‌లు చూపించాల్సిన ప‌రిస్థితి తతెత్తింది.  దీనిపై వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రంను ఆదేశించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: