బ్రేకింగ్: తీవ్ర అనారోగ్యాలతో మావో అగ్ర నేతలు

Gullapally Rajesh
మావోయిస్ట్ అగ్ర నేత శారద పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 25 ఏళ్ళు గా మావోయిస్టులతో ఉండి, 6 నెలల్లో 20 మంది పైగా పార్టీ కి చెప్పకుండా వదిలేసి వెళ్లి పోయారు అని అన్నారు. బీమా, బెవా, అడువ , చుక్కి, శామల, రాకేష్, లక్ష్మీ, సుక్కు ఇలా 20 మంది పార్టీ కి తెలియకుండా వెళ్లి పోయారు అని సముక్క చెప్పింది అని ఆయన మీడియాకు వివరించారు. వెళ్లి పోయిన వారిని మరి మావోయిస్టు పార్టీ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
25 ఏళ్లుగా సముక్క మావోయిస్టు పార్టీ లో పని చేసింది  అని ఆయన తెలిపారు. ఈ మావోయిస్టు విప్లవం ద్వారా ఏమి సాదించలేము అని గ్రహించి తాను పోలీసులు ముందు లొంగిపోయింది అని పేర్కొన్నారు. మావోయిస్టుల అనుసరిస్తున్న హింస సరైనది కాదని ఆమె చెప్పింది అన్నారు. ఇంకా మావోయిస్టు ల పార్టీ లో ఉన్న మిగిలిన వారు కూడా వచ్చేస్తారని తెలిపారు. 25 కేసులలో ఈమె ప్రమేయం ఉంది అని ఆయన వివరించారు. పోలీసులు, మావోలు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ల్లో 6 సార్లు ఆమె స్పాట్ లో ఉన్నారు అన్నారు.
150 మంది తెలంగాణా ప్రాంతంలో మావోలు ఉంటే 14 మంది మాత్రమే తెలంగాణ వారు ఉన్నారు అన్నారు. మిగిలిన 90 మంది పైగ ఛతీస్ ఘడ్ , ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇంకా దళం లో ఉన్న వారు అనారోగ్యం తో భాద పడుతున్నట్లు మాకు సమాచారం ఉంది అని వివరించారు. మీరు వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని కోరుతున్నామని తెలిపారు, పంథాలు వదిలి జన జీవన స్రవంతి లో కలవాలి కోరుకుంటున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dgp

సంబంధిత వార్తలు: