ఈ టీడీపీ నేతల అడ్రస్ ఎక్కడ... జనాలు మర్చిపోయారా ?
దీని ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి విశాఖ జిల్లా అరకు వరకు.. పరిస్థితి ఇబ్బందిగా ఉందని.. తమ్ముళ్లు స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కూడా కరువయ్యారు. మరికొన్ని చోట్ల నేతలు ఉన్నా.. పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహంతో వారు పనిచేయడం లేదు. ఇంకొన్ని చోట్ల పార్టీ నాయకులు అధికార పార్టీ నేతలతో మిలాఖత్ అయిపోయారు., ఇలా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో.. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందని ఒక నిర్నయానికి వచ్చారు.
నిజానికి ఒకప్పుడు.. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉండేది. ఉదాహరణకు.. ప్రత్తిపాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెదరత్తయ్య.. వరు స విజయాలు దక్కించుకున్నారు. దీనిని రిజర్వ్ చేసిన తర్వాత.. సరైన నాయకుడు టీడీపీకి లభించలేదు. ఇక, బాపట్ల పార్లమెంటు స్థానం కూడా ఇలానే ఉంది. ఇక్కడ నుంచిగతంలో గెలిచిన మాల్యాద్రి శ్రీరాం.. గత ఎన్నికల్లో ఓడిపోయి., ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఇక, చిత్తూరులో డిఏ సత్య ప్రభ మృతి తర్వాత.. పార్టీని పట్టుకునే వారు లేకుండా పోయారు. గంగా ధర నెల్లూరు పరిస్థితి కూడా అలానే ఉంది.
కృష్ణా జిల్లా పామర్రు పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదని పార్టీ నేతలే చెబుతున్నారు. తిరువూరులోనూ పార్టీని నడిపించే బలమైన శక్తి లేకుండా పోయింది. అరకులోనూ ఇలానే ఉంది. పాడేరులోనూ.. ఇప్పుడిప్పుడే.. గిడ్డి ఈశ్వరి పుంజుకుంటున్నా.. ఆమెకు గిరిజనులకు మధ్య ఉన్న బంధం ఏమేరకు బలపడుతుందో చూడాలి. ఇలా.. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో దీనిని ఎలా గాడిన పెట్టాలనే విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.