అరవింద్ చెప్తే కేటీఆర్ రాజీనామా చేస్తాడా?
ఇంకా చెప్పాలంటే......
బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఢిల్లీలో చెట్టపట్టాలు వేసుకునే ఆ రెండు పార్టీలూ రాష్ట్రంలో మాత్రం ఒకదానినొ కటి తెగ తిట్టుకుంటాయి. మోడీతో ఎటువంటి విభేదం లేదన్న విధంగానే కేసీఆర్ పైకి ప్రవర్తించినా, రాష్ట్రంలో బీజేపీ ఏ చిన్న విమ ర్శ చే సినా వెంటనే కౌంటర్ ఇచ్చి తన పంతం నిరూపించుకుంటారు. అంతగా ద్వంద్వ వైఖరితో రాజకీయాలు చేసే పార్టీ అధినేతగా అటు కేసీఆర్ కానీ ఇటు బీజేపీ కానీ ఉన్నాయా? అన్నదే ప్రధాన సందేహం. కేసీఆర్ చెప్పిన విధంగా రాజకీయం నడపడం కొంద రికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ భవన్ కోసం స్థలం అడిగినా, సొంత పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం పొందినా ఇలా ఏం చేసినా అవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పుకుని తిరిగే సత్తా కేసీఆర్ కే సొంతం. కానీ నిధుల విషయ మై అరవింద్ చెప్పే మాటల్లో విశ్వసనీయత ఎంత? ఎంత వరకూ నమ్మాలి ? ఎంత వరకూ నమ్మకూడదు అన్నవి ప్రజలకు విడ మర్చి చెప్పే బాధ్యత కేటీఆర్ దే! ఎప్పటి నుంచో నిధులపై లొల్లి ఉందని, దీనిపై ఎవరి క్లారిఫికేషన్ వారిదేనని కొందరు పరిశీలకు లు అంటున్నా, నిజాలు ఎవరి పక్షాన ఉన్నాయో తెలియాలంటే కేటీఆర్ స్పందించాలి.