గురివింద రాజకీయాలు...బాబు కొంపముంచుతున్నారుగా...

M N Amaleswara rao
ప్రతిపక్షంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తగ్గినట్లు కనిపించడం లేదు. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా నాయకుల మధ్య భేదాభిప్రాయాలు స్పష్టంగా కొనసాగుతున్నాయి. తాజాగా టి‌డి‌పికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆ ఓటమి నుంచి ఇప్పుడుప్పుడే బయటపడుతుంది.
కానీ నాయకులు బయటపడనిచ్చేలా కనిపించడం లేదు. తాజాగా జే‌సి ప్రభాకర్ రెడ్డి, ఇతర టి‌డి‌పి నేతల మధ్య రచ్చ మొదలైంది. కార్యకర్తలని కొందరు నాయకులు పట్టించుకోవడం లేదని, జిల్లాలో పార్టీని ఇద్దరు నాయకులు నాశనం చేస్తున్నారని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇక జే‌సి ఇలా మాట్లాడారో లేదో వెంటనే....మిగతా టి‌డి‌పి నేతలు కౌంటర్లు ఇచ్చేశారు. ఏదో ప్రత్యర్ధి నాయకులకు కౌంటర్లు ఇస్తున్నట్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జే‌సిపై ఫైర్ అయ్యారు.
ఇందులో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్...ఇతర నాయకులు కాస్త సాఫ్ట్‌గానే విమర్శించారు గానీ, పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరీలు మాత్రం...ఏదో ప్రత్యర్ధి నాయకుడుని తిట్టినట్లు తిట్టేశారు. అలాగే జే‌సి...వైసీపీతో కలిసి పనిచేస్తున్నారని, జగన్‌ని పొగుడుతున్నారని కామెంట్ చేశారు. అంటే జే‌సి టి‌డి‌పిలో ఉంటూ, పరోక్షంగా వైసీపీ కోసం పనిచేస్తున్నట్లు....పల్లె, ప్రభాకర్‌లు మాట్లాడారు.
ఇక వీరు అలా మాట్లాడారో లేదో వెంటనే సోషల్ మీడియాలో పల్లె రఘునాథ్...తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో టిఫిన్ చేస్తున్న ఫోటో బయటకొచ్చింది. పెద్దారెడ్డితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాగే ప్రభాకర్ చౌదరీ సైతం పెద్దారెడ్డితో ఉన్న ఫోటో మరొకటి బయటకొచ్చింది. జే‌సిపై కామెంట్లు చేసిన పల్లె, ప్రభాకర్ చౌదరీలు గురివింద రాజకీయాలు చేస్తున్నారని పలువురు టి‌డి‌పి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అసలు మొత్తానికి టి‌డి‌పి నేతలు ఇలా గురివింద రాజకీయం చేస్తూ చంద్రబాబు కొంపముంచేలా కనిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: