కంచుకోటల్లో చేతులెత్తేస్తున్న టీడీపీ...వైసీపీకి బంపర్ ఆఫర్...

M N Amaleswara rao
విశాఖపట్నం జిల్లా అంటే మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన జిల్లా. ఏ ఎన్నికల్లోనైనా ఇక్కడ టి‌డి‌పికి కాస్త మంచి ఫలితాలు వచ్చేవి. అయితే గత ఎన్నికల్లోనే పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. అయితే ఆ ఓటమి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. ఎలాగో జిల్లాలో టి‌డి‌పికి అనుకూలంగా పలు నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పికప్ అయ్యేందుకు టి‌డి‌పి ప్రయత్నిస్తుంది.
కాకపోతే కొన్ని కంచుకోటల్లో టి‌డి‌పి పూర్తిగా బలోపేతం కాలేకపోతుంది. పైగా ఆయా స్థానాల్లో వైసీపీపై కాస్త వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్తితిలో టి‌డి‌పి ఉంది. ఉదాహరణకు ఎలమంచిలి.. మొదట నుంచి టి‌డి‌పికి అనుకూలమైన నియోజకవర్గం. ఇక్కడ టి‌డి‌పి ఆరుసార్లు విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది.
వైసీపీ తరుపున కన్నబాబురాజు విజయం సాధించారు. కన్నబాబురాజు పనితీరు పట్ల ప్రజలు అంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. అలా అని ఇక్కడ వైసీపీకి ప్రత్యామ్నాయంగా టి‌డి‌పి ప్రజలకు కనిపించడం లేదు. టి‌డి‌పికి సరైన నాయకత్వం కూడా లేదు. గత ఎన్నికల్లో  టి‌డి‌పి తరుపున ఓడిపోయిన పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అయితే దీంతో టి‌డి‌పికి నామమాత్రంగా ప్రగడ నాగేశ్వరావుని ఇంచార్జ్‌గా పెట్టారు. ఈయన దూకుడు పనిచేయడం లేదు. ఫలితంగా నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకత ఉన్నా సరే, అది టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవ్వడం లేదు.
అటు మాడుగుల నియోజకవర్గంలో అదే పరిస్తితి...ఇక్కడ టి‌డి‌పి ఆరు సార్లు గెలిచింది. గత రెండు ఎన్నికల నుంచి మాడుగులలో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఇలా రెండు సార్లు గెలవడం, పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండి నియోజకవర్గానికి చేసేది ఏమి లేదు. దీంతో నియోజకవర్గంలో వైసీపీపై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ టి‌డి‌పి నేత గవిరెడ్డి రామానాయుడు పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం వైసీపీకే ప్లస్ అవుతుంది. ఇలా కంచుకోటల్లో ఛాన్స్ వచ్చిన సరే టి‌డి‌పి ఉపయోగించుకోలేకపోతుంది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: