తేజ్ బైక్ ప్రమాదంపై.. మాటల మంటలు..!

NAGARJUNA NAKKA
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై నటుడు నరేష్ స్పందించారు. సాయి.. తన కుమారుడు మంచి స్నేహితులనీ.. నిన్న సాయంత్రం ఇద్దరూ తన ఇంటి నుంచే బయల్దేరినట్టు చెప్పారు. బైకుపై స్పీడుగా వెళ్లొద్దని చెప్దామని బయటకు వచ్చే సరికి వెళ్లిపోయినట్టు వెల్లడించారు. పెళ్లి-కెరీర్ తో జీవితంలో సెట్ కావాల్సిన వయసులో ఇలాంటి రిస్క్ లు చేయొద్దన్నారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటి రెడ్డి కుమారులు ప్రమాదానికి గురై శోక సంద్రంలో ముంచెత్తినట్టు గుర్తు చేశారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో నరేశ్ మాట్లాడిన తీరు సరికాదని నిర్మాత బండ్ల గణేశ్ అన్నాడు. సాయి తేజ్ కు జరిగింది చిన్న ప్రమాదమనీ.. ఈ సమయంలో నరేశ్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రేసింగ్ చేశాడు అని చెప్పడం ఇప్పుడు ఎందుకు సార్.. ఎప్పుడు ఏం మాట్లాడాలో అందరూ నేర్చుకోండి.. అని వ్యాఖ్యానించారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందాం..అని బండ్ల గణేశ్ అన్నాడు.
సాయి ధరమ్ తేజ్ విషయంలో నటుడు నరేశ్ వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. ఆయన త్వరగా కోలుకొని సినిమాల్లో మనతో కలిసుండాలని కోరుకుందాం..ఇప్పుడు రాజకీయాలు వద్దు అన్నాడు. సాయి ధరమ్ తేజ్ రేసింగ్ చేస్తాడని నరేశ్ అనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఆయన వెళుతున్న స్పీడు తక్కువే. రోడ్డు మీదున్న ఇసుక వల్లే ప్రమాదం జరిగింది.. దయచేసి రేసింగ్ పక్కనపెడదాం.. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుందామన్నాడు.
ఇక హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ స్పందించారు. అతివేగంగా వెళ్లినందుకు కేసు పెట్టిన పోలీసులు.. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్ స్ట్రక్షన్ కంపెనీపై కూడా కేసు నమోదు చేయాలన్నాడు. అలాగే రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నాడు. అప్పుడే నగరంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆర్.పి పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు సాయి ధరమ్ తేజ్ పై పుకార్లు ఆపాలని మంచు లక్ష్మి కోరింది. తనకు తెలిసిన అత్యంత బాధ్యత గల పౌరుల్లో తేజ్ ఒకరు. అతన వేగంగా బండి నడపలేదని స్పష్టంగా తెలుస్తోంది. రోడ్డుపై బురదే ప్రమాదానికి కారణం. పుకార్లు వ్యాప్తి చేయడం ఆపాలని కోరింది. ప్రస్తుతం తేజ్ బాగానే స్పందిస్తున్నాడనీ.. అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నందుకు ఆనందిద్దాం.. అని ఆమె పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: