వినాయక చవితి కి విఘ్నాలు ను తొలగించిన హై కోర్టు కు కృతజ్ఞతలు తెలిపారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. విఘ్నాలు అన్ని తొలగి అందరికీ మంచి జరగాలని వినాయకుడుని వేడుకుంటానని.. చెత్త బండ్ల కు కూడా మా పార్టీ రంగులు ఏందుకు వేస్తున్నారు ? ఫైర్ అయ్యారు. కోర్టులు ఏన్ని మొట్టికాయలు వేస్తున్నా అధికారులకు బుద్ధి రావడం లేదని.. డబ్బుల కోసం ఇప్పటివరకు చేస్తున్న వ్యాపారాలు చాల వన్నట్లు ఇప్పుడు సినిమా టిక్కెట్లు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. సినిమా హాళ్లు, టిక్కెట్లు పై మీ పెత్తనం ఏంటి ? లాభాల్లో ఉన్న గంగవరం పోర్టు ను ఎందుకు అమ్మారన్నారు.
డబ్బులు కావాలి అంటే లాభాల్లో ఉన్న సంస్థ ను నడప కుండా అమ్ముకుంటూ టిక్కెట్లు వ్యాపారం ఏంటి ? మనం ఎవరం ఈ వ్యాపారం చేయటానికి? అని మండిపడ్డారు. మీరు సినిమా టిక్కెట్లు వ్యాపారం చేస్తున్నట్లు రేపు ఒక వేళ కేంద్ర ప్రభుత్వం భారతి సిమెంట్ లో ఉత్పతులకు తనే ధర నిర్ణయించి అమ్ముకుని విలు ను బట్టి డబ్బులు ఇస్తామంటే ఎలా ఉంటుందో ఆలోచించన చేయాలని సూచించారు. చిరంజీవి సహ సినిమా రంగ ప్రముఖులు ముందుకు వచ్చి మాట్లాడాలని... రియల్ హీరోలు అందరూ మీ పరిశ్రమ పై జరుగుతున్న దండయాత్ర పై స్పందించాలని తెలిపారు. సినిమా టిక్కెట్లు కు తోడు ఇప్పుడు మాంసం కొట్లు తెరుస్త మంటున్నారని... మనమే మటన్ షాప్స్ పెట్టీ అమ్మడం ఏంటి ? అని ఫైర్ అయ్యారు.
జగనన్న కాయగూరల దీవెన అని పెట్టీ రైతులకు అండగా నిలబడండి... ఒక వైపు లాభాల్లో ఉన్న గంగవరం పోర్టు ను అమ్ముతూ మరోవైపు నష్టాల పేరుతో విశాఖ ను అమ్ముకోవాలనే కేంద్ర ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటారు జగన్ గారు అంటూ నిప్పులు చెరిగారు. కరోనా ఎదుర్కొనే విషయం లో అట్టడుగు ర్యాంకు లో ఉన్నామని... ఓదార్పు అనేది మా పార్టీ, మా నాయకుడి పేటెంట్ అనుకుంటా అందుకే లోకేష్ అరెస్ట్ అనుకుంటా ? అని మండిపడ్డారు. లోకేష్ అరెస్ట్ సరైన పని కాదని... చురకలు అంటించారు రఘురామ కృష్ణంరాజు.