కవిత చేయలేని పని.. కెసిఆర్కు షర్మిల చేసి పెడుతుంది?

praveen
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని రాజకీయ నేతగా కొనసాగుతున్న కెసిఆర్ రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు కవిత. ఇక మొదట నిజాంబాద్ ఎంపీ గెలిచిన కవిత ఆ తర్వాత మాత్రం విజయం సాధించలేకపోయారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఎలాంటి పదవి లేకుండా ఉన్న కవితకు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే..  ఇప్పుడు వరకు కవిత తెలంగాణ రాజకీయాల్లో కాస్త క్రియాశీలకంగా కనిపించినట్లు అనిపించినప్పటికీ కెసిఆర్ కు ఉపయోగపడే విధంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయలేదు.



 కానీ ఇప్పుడు.. ఏకంగా కేసీఆర్ రాజకీయ వారసురాలు కవిత చేయలేనిది అటు కెసిఆర్ సంధించిన బాణం  షర్మిల చేస్తుంది అన్న టాక్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది.  ఎందుకంటే తెలంగాణలో షర్మిల పార్టీ పెడతాను అని ప్రకటించిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలు వేస్తున్న అడుగులు అన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీకి మేలు చేకూర్చే విధంగానే ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించడం.. ఇక విపక్షాల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా షర్మిల ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె వేసే అడుగులు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి.



 సాధారణంగా ఎవరైనా సరే కొత్తగా పార్టీ పెడితే పార్టీ బలాన్ని అంతకంతకూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ షర్మిల మాత్రం పార్టీ పెడతానని ప్రకటించినప్పుడే నిరుద్యోగుల కోసం పోరాటం అనే నినాదం అందుకుంది. ఇక ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతుంది అనే మరో అజెండా  ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.  ఇలా కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత తో ఉన్న వారందరినీ కూడా ఇక వారితో చేతులు కలిపి ఏకంగా చాపకింద నీరులా ఎవరికి తెలియకుండా ప్రతిపక్షాల ఓటుబ్యాంకు దెబ్బతీయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పటి వరకు అసలు కెసిఆర్ రాజకీయ వారసురాలు కవిత చేయలేని పని  షర్మిల చేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: