ఈటల రాజేందర్ పై దళితుల దాడి ?

frame ఈటల రాజేందర్ పై దళితుల దాడి ?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా సాగుతోంది. ఎలాగైనా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు... కంకణం కట్టుకున్న గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు... అనేక వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దళిత బంధు లాంటి పథకాలను తెలంగాణ సర్కార్ తీసుకువచ్చింది. ఇక... తెలంగాణ మంత్రుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు అందరూ హుజూరాబాద్ నియోజకవర్గం లోని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ లో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు హుజూరాబాద్ నియోజకవర్గం లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.


ప్రజల్లో తిరుగుతూ... టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్... టిఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై... నోరుజారు తున్నారు. నిన్న ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చాలా ఘాటు విమర్శలు చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను... తమకు అనుకూలంగా మలచుకునే దిశగా టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ వ్యాఖ్యలను టార్గెట్ చేశారు టిఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు.


ఈటెల రాజేందర్ కు దళితులు అంటే గౌరవం లేదని... అందుకే తెరాస కు సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు తిడుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే దళితులకు ఈటెల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఒకవేళ దళితులకు క్షమాపణలు చెప్పకపోతే.... పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దళితులే ఈటల రాజేందర్ పై దాడి చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈటెల రాజేందర్ పై జరిగే దాడులను టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు కూడా ఉండదని స్పష్టం చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత వేడి వాడి గా మారిపోయింది. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లూ.. పెట్టి ఈటెల పై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ డ్రామాలు అని బిజెపి నాయకులు కొట్టిపారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: