తాలిబన్ల వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి ?

frame తాలిబన్ల వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి ?

Veldandi Saikiran
మనదేశంలో పెట్రోల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు లీటరుపై 50 రూపాయల మేరకు పెట్రోల్ ధరలు పెరిగాయి. 7 సంవత్సరాల క్రితం 65 రూపాయలు ఉన్న ఆ లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం సెంచరీ దాటి... 150 కి చేరువలో ఉంది.  దేశంలోని చాలా వరకు అన్ని రాష్ట్రాల్లోనూ సెంచరీ కొట్టేసాయి పెట్రోల్ ధరలు. దీంతో పాటు డీజిల్ ధరలు కూడా... పెట్రోల్ ధరను బీట్ చేసేస్తున్నాయి. ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఇక పెట్రోల్ ధరలు పెరగడం పై కేంద్రంలోని బిజెపి పార్టీ.. మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ తలో మాట చెప్పేస్తున్నారు. 


పెట్రోల్ ధరల పాపం గత ప్రభుత్వం అయిన కాంగ్రెస్దేనని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అలాగే కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి నేతలు.... పెట్రోల్ ధరలపై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఇక బిజెపి పార్టీ కార్యకర్తలు అయితే... హిందూ ధర్మం కోసం పెట్రోల్ ధరలను భరించాల్సిందే నంటూ ప్రచారం కూడా చేసేస్తున్నారు. అయితే తాజాగా... పెరుగుతున్న పెట్రోల్ ధరలపై తాలిబాన్లకు లింక్ పెట్టేసారు మరో నేత. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే... అరవింద్ ది లార్డ్ పెట్రోల్ ధరలకు చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


" ఆఫ్ఘనిస్తాన్ దేశం లో తాలిబన్ల సంక్షోభం కారణంగా ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. అందుకే పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓటర్లకు అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో తెలుసుకునే అంత జ్ఞానం లేదు. ధరలు పెరుగుతున్నాయని ఊరికే ప్రభుత్వాన్ని తిడతారు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ ఎమ్మెల్యే. దీంతో ఆయనపై విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రజలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. ఆటో నెటిజన్లు సైతం ఎమ్మెల్యే పై ట్రోలింగ్ మొదలు పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: