టీచర్ల వెతలు: టీచర్ స్థాయి ఇంత దిగజారిందా ?

VAMSI
ఒకప్పుడు గురువుకు మన సమాజంలో ఎంతో విశిష్టత , ప్రత్యేకమైన స్థానం ఉండేది. రాజ్యాలు పాలించే రాజులు సైతం గురువులు ముందు తలవంచి పాదాభివందనం చేసే వారు. వారి వద్ద విద్యను ఎంతో గౌరవ మర్యాదలతో అభ్యసించి, వారు చెప్పిందల్లా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు. విద్యాభ్యాసం అనంతరం గురువులకు గురు దక్షిణ ఇచ్చి సత్కరించే వారు. గురువులను, బ్రాహ్మణులను సర్వ శ్రేష్ట జ్ఞానులుగాను, సకల శాస్త్రాలు తెలిసిన మేధావులుగా గౌరవించే వారు. మారుతున్న కాలంతో పాటు ఈ పద్ధతి కూడా మారింది. గురువులకు విలువ తగ్గుతోంది. బ్రతకలేక బడి పంతుల్లుగా మారుతున్నారు అంటూ చులకన భావం చూపుతున్నారు. టీచర్లకు రాను రాను గౌరవం తగ్గుతోంది.   వారి కీర్తి ప్రతిష్టలు అటుంచితే కనీస మర్యాదలు కూడా అందడం లేదంటూ వాపోతున్నారు కొందరు ఉపాధ్యాయులు. టీచర్స్ డే వస్తే కానీ గురువును మనస్పూర్తిగా గౌరవించని రోజుల్లో ఉన్నామంటే అతిశయోక్తి కాదు. 

కొందరైతే వారికి విద్యను అందించే గురువులు కనబడితే  మొక్కుబడిగా ఎదో ఒక గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతారు. ఎంతో గౌరవంగా చేతులు జోడించి నమస్కరించి గురువును గౌరవించే వారి సంఖ్య తగ్గుతోంది. మన జీవితానికే జ్ఞానాన్ని ప్రసాదించే గురువులకు అంతమాత్రం జీతాలు మాత్రమే ఇస్తున్నారు. అందులోనూ  ఈ కరోనా సమయంలో టీచర్లు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ కరోనా కష్ట  కాలంలో ఎంతో మంది టీచర్లు మరియు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీతాలు ఇవ్వకపోవడంతో ఎంతో మంది ఉపాధ్యాయులు తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీదుల్లో  కూరగాయల వ్యాపారాలు, చిల్లర కొట్లు, చిన్న చిన్న పనులు ఏ పని దొరికితే అది చేసుకుపోతున్నారు. ఆదాయం  లేకపోయినా పూట గడిస్తే చాలు అంటూ బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.

కొందరు టీచర్లైతే చిన్నా చితక పనులు చేయలేక తమ స్థిరాస్తులను అమ్ముకుని మరి కుటుంబాలను పోషిస్తున్నారు. అటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ, ఇటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కానీ  జీతాలు సరిగా అందడం లేదు. ప్రభుత్వ, ప్రవేటు యాజమాన్యాల నిర్లక్ష్యం టీచర్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది అంటూ కొందరు ఉపాధ్యాయులు బోరుమంటున్నారు. కొన్ని స్కూళ్ళలో టీచర్ల తో ఆన్లైన్ తరగతులని, ప్రిపరేషన్ లు అని పనులు చేయించుకుంటున్నారు. కానీ అందుకు తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే, ఇప్పుడు చేయకపోతే తర్వాత మీకు జాబ్ ఉండదు అంటూ వేదిస్తున్నారట. మరి ఈ పరిస్థితులు మరేదెన్నడు అనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: