కేసీఆర్ అంటే సీఎం : ఆంధ్రా ఆస్తులు తెలంగాణవే!
విభజన కారణంగా ఏపీ ఏమయినా సాధించిందా? పాత సీఎం చంద్రబాబు కారణంగా తట్టాబుట్టా సర్దుకుని అమరావతిలో పాలన అని హంగామానే తప్ప ఏమయినా గొప్పదనం లభించిందా? ఆ రోజు కోర్టు విభజన కు సంబంధించి కూడా మీరు ఇక్కడ ఉంటా మంటే భవన నిర్మాణానికి నిధులు కూడా ఇస్తామని తెలంగాణ చెప్పింది కానీ ఇదంతా ఎందుకు అని ఓటు కు నోటు కేసు హడా వుడిలో భాగంగా మొత్తం అక్కడ ఏమీ లేకుండా, ఏమీ మిగల్చకుండా ఇక్కడికి వచ్చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టుకు ఓ అదనపు భవంతి కావాలి. డబ్బులున్నాయి జగన్ దగ్గర.. నిర్మించేవాళ్లే లేరు. దాదాపు ముప్పై కోట్లతో భవంతిని నిర్మిద్దామని జగన్ భావిం చినా కుదరని పని. విభజన కారణంగా అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ సాధించేదేమీ లేదు. ఉమ్మడి ఆస్తులను అప్పణం గా ఇచ్చి వచ్చారే తప్ప అంతకుమించి వీళ్లు సాధించిన పుణ్యం ఏమీ లేదు.
ఇంకా చెప్పాలంటే......
ఆంధ్రా - తెలంగాణ గొడవల్లో ఎక్కువ లాభం పొందింది తెలంగాణనే. పొరుగు రాష్ట్రంకు సంబంధించి ఆస్తుల తగాదా ఎంత ఉన్నప్ప టికీ ఏపీ పెద్దలు చాలా ఇచ్చి వచ్చారు. చంద్రబాబు భవంతులకు తాళాలు వేసి వస్తే, జగన్ ఆ తాళాలు సంబంధిత టీ సర్కారుకు ఇచ్చి హాయిగా ఆస్తుల విభజన ప్రక్రియ ముగించేశారు. దీంతో ఆంధ్రా ఆస్తులు విలువయిన భవంతులు అన్నీ మూడో కంటికి తెలి యకుండానే కేసీఆర్ సర్కారు కొట్టేసింది. ఫలితంగా ఆంధ్రాకు దక్కింది ఏమీ లేదు. ఇదంతా ఆంధ్రా పాలకుల అసమర్థత. ఇంతకు మించి ఏమీ మాట్లాడలేం. పదేళ్ల రాజధానిని ఆ రోజు చంద్రబాబు వదిలి వచ్చినా, ఇక్కడ పాలన పేరుతో అమరావతి కేంద్రంగా భ వంతుల నిర్మాణం చేపట్టినా, అటుపై ఆయన చేపట్టిన భవంతులను కొన్ని ఆపేసినా ఇవన్నీ జగన్, చంద్రబాబు సమష్టిగా చేసిన తప్పిదాలు.