వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ శాంతిస్తుందా ?

VAMSI
ఈ రోజు దివంగత మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి. ఆ రాజన్న మనల్ని అంతా వదిలి వెళ్లి నేటికి సరిగ్గా 12 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా ఆ చిరునవ్వు, ఎటువంటి కల్మషం లేని ప్రేమ ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాయి. రాజన్న ప్రజల కోసం చేయాలి అనుకున్న పనులలో చాలా వరకు తన రాజకీయ జీవితంలో పూర్తి చేశారు. అయితే వీరి సన్నిహితులు అనుకుంటున్న ప్రకారం ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయన ఆత్మ శాంతించేలా కనిపించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం సొంత కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు అంటున్నాయి వైఎస్ సన్నిహిత వర్గాలు. వైఎస్ ఉన్నప్పుడు వరకు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా కలిసిమెలసి ఉండేది. కానీ కొంత కాలం నుండి జరుగుతున్న రాజకీయ పరిణామాలు సొంతింటిలో కుంపటి పెట్టాయి అని అంటున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నా చెల్లెళ్ళు అయినప్పటికీ... వారి మధ్యన సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా అన్నాచెల్లెళ్ల బంధాన్ని మరిచిపోకూడదని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా మొన్న జరిగిన రక్షా బంధన్ రోజున జగన్ కు షర్మిల రాఖీ కట్టకపోవడం చాలా దురదృష్టకరమని అంటున్నారు. కనీసం ఈ రోజు వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని సమాధి వద్దకు జగన్ షర్మిళలు ఒకే సమయానికి వచ్చి కలుస్తారు అని ఆశించిన అభిన్నులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. వీరిద్దరూ ఒకే సమయానికి రావడం లేదు. ఇద్దరూ వేరే వేరే షెడ్యూల్ ను చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకన్నా వైఎస్సార్ ఆత్మ  శోకించే విషయం ఏమైనా ఉంటుందా? అంతే కాకుండా వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి మృతి తర్వాత ఇరు కుటుంబాల మధ్యన కూడా మనస్పర్థలు ఉన్నాయి. కాబట్టి ప్రతి సారి జయంతి అలాగే వర్ధంతి రోజున వచ్చి పాల్గొనే వారు ఈసారి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా ఇన్ని బాధలను చూస్తూ ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండలేదు. మరి ఇక ముందైనా అందరూ కలిసి ఉంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: