తాలిబన్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది..!

NAGARJUNA NAKKA
పంజ్ షీర్ ఆక్రమణకు బయల్దేరిన తాలిబన్లకు చేదు అనుభవం ఎదురవుతోందట. అహ్మద్ మసూ, ఆప్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా ఆధ్వర్యంలోని సేనలు తాలిబన్లకు ధీటుగా సమాధానం ఇచ్చాయని సమాచారం. వారి ధాటికి ఎక్కువ మొత్తంలో తాలిబన్లు గాయపడ్డారట. ప్రస్తుతం కపిసా ప్రావిన్స్ పరిసరాల్లో వీరంతా చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా తాలిబన్లు దాడి చేయడంతో పంజ్ షీర్ దళాలు ప్రతిఘటించాయట.
ఇక ఆప్ఘాన్ పరిస్థితుల నేపథ్యంలో సమీకృత యుద్ధ బృందాలు ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం అన్ని దేశాలకు సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ పై భారత్ సరైన వ్యూహం రచించాల్సి ఉందని తెలిపారు. వ్యూహం మార్పులో భాగంగానే క్వాడ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
మరోవైపు అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి అమెరికా, చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. ఆఫ్ఘాన్ పరిస్థితులపై ఇరుదేశ మిలిటరీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించినట్టు చైనా మీడియా పేర్కొంది. ఆప్ఘాన్ పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని ఈ సందర్భంగా చైనా ఆందోళన వ్యక్తం చేసిందట. అయితే ఈ రెండు దేశాలు కలిసికట్టుగా ఆప్ఘాన్ సమస్యపై దృష్టిపెడితే పెద్ద ప్రమాదం తప్పిపోతుందని చైనా మిలిటరీ భావిస్తోందట.
మరోవైపు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి హెచ్చరించారు. ఆత్మాహుతి దాడిలో తమ పౌరుల ప్రాణాలు బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. రాగల 24-30గంటల్లో మరో దాడి జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. అయితే శనివారం ఐసీస్-కె ఉగ్రసంస్థ స్థావరాలపై డ్రోన్ దాడి జరిపిన అమెరికా దళాలు.. ఆత్మాహుతి దాడుల సూత్రధారి సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దీంతో ఆఫ్ఘాన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాబుల్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఐసిస్-కె ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులు జరిపింది. ఐసిస్-కె ఉగ్రసంస్థ ఆత్మాహుతి దాడులు జరిపింది. ఐసిస్-కె పాల్పడే దాడుల్లో చాలా వరకు పాకిస్థాన్ లో తయారైన పేలుడు పదార్థాలే వినియోగిస్తున్నారు. పెషావర్, క్వెట్టా నుంచి బాంబులకు కావాల్సిన సామాగ్రి
ఐసిస్ కు సరఫరా అవుతోంది. ఆప్ఘాన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: