డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకులంలో మీడియాతో మాట్లాడారు . ఈ సంధర్భంగా ఆయన క్రీడలపై ఆసక్తికర కామెంట్ లు చేశారు . క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ధర్మాన వ్యాఖ్యానించారు . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్నారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ధర్మాన కోరారు . వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది తన భావన అంటూ ధర్మాన చెప్పారు. క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు .
ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ..క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. సమాజం పట్ల గౌరవం, క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రిగా కంటే క్రీడలంటేనే తనకు చాలా ఇష్టమని అన్నారు . ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసంటూ వ్యాఖ్యానించారు. గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవని...కానీ ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ధర్మాన అన్నారు. క్రీడలతోనే తనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు .
తాను స్కూల్ లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడినంటూ వ్యాక్యానించారు. ఆటల కోసమే విశాఖ వెళ్లి తాను డిగ్రీలో చేరానని చెప్పారు . క్రీడాకారుడిని కావడం వల్లే తనకు ఉద్యోగం....డిగ్రీలు వచ్చాయని చెప్పారు. ఒక క్రీడాకారుడికి ఎంత గౌరవం దక్కుతుందో పీవీ సింధును చూస్తే మీకే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో షటిల్ మరియు బ్యాడ్మింటన్ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మాన వ్యాఖ్యానించారు. ఇక్కడి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు పీవీ సింధును శ్రీకాకుళం జిల్లాకు తీసుకువస్తానంటూ ధర్మాన వెల్లడించారు .